India Vs Pakistan: క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగే.. ఇండియా, పాకిస్థాన్ ఫైట్.. ఏకంగా మూడు సార్లు.. రచ్చ రచ్చే.. !

ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ చివరిసారిగా తలపడ్డాయి.

India Vs Pakistan: క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగే.. ఇండియా, పాకిస్థాన్ ఫైట్.. ఏకంగా మూడు సార్లు.. రచ్చ రచ్చే.. !

Updated On : July 26, 2025 / 8:06 PM IST

India Vs Pakistan: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. ఇరు దేశాలకు చెందిన క్రికెట్ ఫ్యాన్స్ ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఫైట్ ను ఆసక్తిగా తిలకిస్తారు. పాక్ ను మనోళ్లు చిత్తు చిత్తుగా ఓడించాలని కోరుకుంటారు. ప్రపంచ క్రికెట్ లో ఏ జట్ల మ్యాచ్ కు లేనంత క్రేజ్.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు ఉంటుంది.

అయితే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగింది లేదు. ఈ పరిస్థితుల్లో భారత్, పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్ వచ్చేసింది. ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. అది కూడా ఏకంగా మూడు సార్లు అని తెలుస్తోంది.

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆసియా కప్ 2025 నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ టోర్నీ నిర్వహణకు అడ్డంకులు తొలిగిపోయాయి. అంతేకాదు షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. ఆ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ తెలిపారు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుండి 28 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుందని ఆయన చెప్పారు.

మైదానంలో రెండు గట్టి ప్రత్యర్థులుగా ఉన్న భారత్, పాకిస్తాన్ ఈ ఖండాంతర టోర్నమెంట్ కోసం ఒకే గ్రూప్‌లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. మొత్తం మూడుసార్లు ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. గ్రూప్ దశలో ఒకసారి, సూపర్ ఫోర్ లో మరోసారి, ఒక వేళ రెండు జట్లు ముందుకు సాగితే ఫైనల్ లోనూ తలపడే అవకాశం ఉంది.

ఆసియా కప్‌లో ఎనిమిది జట్లు T20 ఫార్మాట్‌లో పోటీపడతాయి. ఇది వచ్చే ఏడాది T20 ప్రపంచ కప్‌నకు ముందు సన్నాహక టోర్నీ లాంటిది. టోర్నమెంట్ ఫార్మాట్ గ్రూప్ దశలో కనీసం ఒకసారి భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. భారత్, పాక్ మధ్య క్రికెట్, రాజకీయ సంబంధాలు దెబ్బతినడంతో రెండు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒకదాంతో ఒకటి ఆడటం మానేశాయి.

Also Read: గ‌త 10 ఏళ్ల‌లో భార‌త బౌల‌ర్ల చెత్త ప్ర‌ద‌ర్శ‌న ఇదే.. ఏకంగా 500 ర‌న్స్‌..

గత వారం అనుభవజ్ఞుల టోర్నమెంట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) లోనూ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. యువరాజ్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్, శిఖర్ ధావన్ వంటి ప్రముఖ భారత క్రికెటర్లు జట్టులో ఉన్నారు. అయితే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇదేనా మీ దేశభక్తి అంటూ నెటిజన్లు భారత ఆటగాళ్లను నిందించారు. తీవ్ర విమర్శలు రావడంతో ఆ మ్యాచ్ రద్దైంది.

ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఆసియా కప్ లో 8 జట్లు పాల్గొంటాయి. ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, హాంకాంగ్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. 8 జట్లను నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, పాక్ ఒకే గ్రూప్ లో ఉండనున్నాయని సమాచారం. ఆసియా కప్ టోర్నమెంట్ తేదీలు, వేదికలను త్వరలో ప్రకటిస్తామని నఖ్వీ వెల్లడించారు. దుబాయ్, అబుదాబి 19 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయని భావిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ 2026 సన్నాహకాల్లో భాగంగా దీన్ని నిర్ణయించారు. టీ20 ప్రపంచ కప్‌ను భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ చివరిసారిగా తలపడ్డాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. టోర్నమెంట్‌ను గెలుచుకుంది.