పంత్ స్థానంలో సంజూ శాంసన్ బెటర్, వేరే దేశానికి వెళ్లిపో

పంత్ స్థానంలో సంజూ శాంసన్ బెటర్, వేరే దేశానికి వెళ్లిపో

Updated On : December 9, 2019 / 2:21 AM IST

కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. పేలవ ఫీల్డింగ్ తో పాటు పంత్ వికెట్ కీపింగ్ లోపాలు కోహ్లీసేనకు విజయాన్ని దూరం చేశాయి. రెండో టీ20కు ముందు బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంజూ శాంసన్ వీడియోను పోస్టు చేయడంతో ఈ మ్యాచ్‌లో ఆడతాడనే హింట్ ఇచ్చింది. పంత్ కీపింగ్‌లో లోపాలు ఉండటంతో శాంసన్ అయితే సెట్ అవుతాడని భావించారంతా. 

కానీ, టాస్ అనంతరం కోహ్లీ ప్రకటించిన ఎలెవన్ సభ్యులతో అందరిలో నిరుత్సాహం కనిపించింది. ఫలితంగా సంజూ శాంసన్ బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. మరోసారి ఈ మ్యాచ్ లోనూ పంత్ పేలవ ప్రదర్శన కనబరిచి క్యాచ్ లు జారవిడవడంతో శాంసన్‌ ను జట్టులోకి తీసుకోలేదని సానుభూతి కురిపిస్తుంది సోషల్ మీడియా.

శాంసన్ వేరే దేశానికి వెళ్తే అతనికి మంచి భవిష్యత్ ఉంటుందని భారత్ లో ఉన్న కారణంగానే అవకాశాలు కోల్పోతున్నాడు. పంత్ ఎందుకు సంజూ శాంసన్ ను తీసుకోండి. స్టేడియంలో ఉన్న గుంపు నుంచి సంజూ శాంసన్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే గుంపులోనే శాంసన్ ను కలిపేశారు. 

మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఉప్పల్ లో తొలి విజయం అందుకున్న భారత్..వెస్టిండీస్ తో రెండో మ్యాచ్ ను కోల్పోయింది. తిరువనంతపురం వేదికగా మ్యాచ్ తో సిరీస్ ను సమయం చేసుకుంది. నిర్ణయాత్మక మ్యాచ్‌ను ఇరు జట్లు బుధవారం ముంబైలోని వాంఖడే వేదికగా ఆడనున్నాయి.