ఆ.. చూశాంలే: పాండ్యా హెలికాప్టర్ షాట్ పై ధోనీ రియాక్షన్

ఆ.. చూశాంలే: పాండ్యా హెలికాప్టర్ షాట్ పై ధోనీ రియాక్షన్

Updated On : April 4, 2019 / 8:49 AM IST

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ముంబై 37 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. బుధవారం వాంఖడే వేదికగా హార్దిక్ పాండ్యా చివరి ఓవర్లలో రెచ్చిపోవడమే ఇందుకు కారణం. బ్రావో వేసిన ఆఖరి ఓవర్లో హెలికాఫ్టర్ షాట్ లతో విజృంభించాడు. చివరి రెండు ఓవర్లలో ముంబై ఇండియన్స్ కు 45 పరుగులు వచ్చి చేరాయి. అందులో పాండ్యా ఆడిన 8 బంతుల్లో 25పరుగులే కీలకం. ఈ స్కోరుకు పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా దక్కింది. 

ఈ బాదుడులో ధోనీ మొదలుపెట్టిన హెలికాఫ్టర్ షాట్ ను పాండ్యా కాపీ కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఈ షాట్ కొట్టేందుకు ఎంతో మంది ప్లేయర్లు ప్రయత్నించినా పాండ్యాకు సెట్ అయినంతగా ఎవరూ సక్సెస్ కాలేదు. డెత్ ఓవర్ బౌలింగ్ వేస్తున్న బ్రావోకు పాండ్యా చుక్కలు చూపించాడు. ఆ షాట్ లకు ధోనీ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ముంబై జట్టు స్కోరు పెరిగిపోతుందని అసహనం వ్యక్తం చేస్తూ ముఖాన్ని అటువైపుగా తిప్పుకున్నాడు. 

ఈ హిట్టింగ్ గురించి పాండ్యా మాట్లాడుతూ.. ఓ ఆదర్శనీయమైన వ్యక్తి ముందు ఆ షాట్ కొట్టడం చాలా ప్రత్యేకం. మ్యాచ్ తర్వాత ధోనీ అభినందిస్తాడనుకున్నా’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు. గేమ్ మొత్తం ముంబైకి ఫేవర్ గానే కనిపించింది. చెన్నై ఓపెనర్లు ఆరంభంలోనే తడబడడం ప్రధాన కారణం. దీంతో పాటు ముంబై ఇన్నింగ్స్  డెత్ ఓవర్లలో చెన్నై బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.