IND vs ENG 5th Test : ముగిసిన తొలి రోజు ఆట‌.. భార‌త్ 135/1

ధ‌ర్మ‌శాల వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ముగిసింది.

IND vs ENG 5th Test : ముగిసిన తొలి రోజు ఆట‌.. భార‌త్ 135/1

IND vs ENG 5th Test

Updated On : March 7, 2024 / 5:09 PM IST

ముగిసిన తొలి రోజు ఆట‌.. 
ధ‌ర్మ‌శాల వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ముగిసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా.. భార‌త్ తొలి రోజు ఆట ముగిసే స‌మయానికి వికెట్ న‌ష్ట‌పోయి 135 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ (52; 83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శుభ్‌మ‌న్ గిల్ (26; 39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భార‌త్ ఇంకా 83 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.

య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ.. ఆ వెంట‌నే ఔట్‌
షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 56 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అత‌డి బౌలింగ్‌లోనే స్టంపౌట్ అయ్యాడు. మొత్తంగా జైస్వాల్ 58 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్స‌ర్లు బాది 57 ప‌రుగులు చేశాడు. భార‌త్ 20.4వ ఓవ‌ర్‌లో 104 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

ఇంగ్లాండ్ 218 ఆలౌట్‌
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 218 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో జాక్‌క్రాలీ (79) హాఫ్ సెంచ‌రీ చేశాడు. జానీ బెయిర్ స్టో (29), బెన్‌డ‌కెట్ (27), జోరూట్ (26), బెన్‌ఫోక్స్ (24)లు మంచి ఆరంభాలు ల‌భించినా వాటిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయారు. భార‌త బౌల‌ర్లలో కుల్దీప్ యాద‌వ్ ఐదు వికెట్లు తీశాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ర‌వీంద్ర జ‌డేజా ఓ వికెట్ సాధించాడు.

టీబ్రేక్.. 
ధ‌ర్మ‌శాల టెస్టులో తొలి రోజు టీ విరామానికి ఇంగ్లాండ్ 55 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 194 ప‌రుగులు చేసింది. బెన్‌ఫోక్స్ (8), షోయ‌బ్ బ‌షీర్ (5)లు క్రీజులో ఉన్నారు.

48 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 183/6
కుల్దీప్ యాద‌వ్ ధాటికి ఇంగ్లాండ్ బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్నారు. 48 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 183/6. బెన్‌ఫోక్స్ (2), టామ్‌హార్డ్లీ (6) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ఆరు వికెట్లు కోల్పోగా అందులో కుల్దీప్ యాద‌వ్ ఐదు వికెట్లు తీయ‌డం గ‌మ‌నార్హం.

ఓలిపోప్ ఔట్‌.. 
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ఓలిపోప్ (11) స్టంపౌట్ అయ్యాడు. దీంతో 25.3వ ఓవ‌ర్‌లో 100 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్‌ను తీసుకున్నారు. లంచ్ బ్రేక్‌కు ఇంగ్లాండ్ స్కోరు 25.3 ఓవ‌ర్‌లో 100/2. జాక్‌క్రాలీ (61) క్రీజులో ఉన్నాడు.

జాక్‌క్రాలీ హాఫ్ సెంచ‌రీ
కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 64 బంతుల్లో క్రాలీ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.


బెన్‌డ‌కెట్ ఔట్‌
ఎట్ట‌కేల‌కు భార‌త బౌల‌ర్లు వికెట్ ప‌డ‌గొట్టారు. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో శుభ్‌మ‌న్ గిల్ మెరుపు వేగంతో వెన్కక్కి ప‌రిగెత్తి అద్భుతంగా క్యాచ్ అందుకోవ‌డంతో బెన్‌డ‌కెట్ (27) ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 17.6వ ఓవ‌ర్‌లో 64 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

నిల‌క‌డ‌గా ఆడుతున్న ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు..
భార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. దీంతో ఎప్ప‌టిలా దూకుడుగా కాకుండా ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు ఆచితూచి ఆడుతున్నారు. 10 ఓవ‌ర్లకు ఇంగ్లాండ్ స్కోరు 35/0. బెన్‌డ‌కెట్ (11), జాక్ క్రాలీ (23) లు ఆడుతున్నారు.

ధర్మశాలలో టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ ఎంచుకుంది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. అశ్విన్‌‌తో పాటు బెయిర్‌స్టో వందో మ్యాచు ఆడుతున్నారు. భారత్ 3-1తో ఆధిక్యంతో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగే ఎంచుకునేవారిమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

ఇప్పటివరకు ఈ సిరీస్‌లో బాగా రాణించామని రోహిత్ శర్మ చెప్పాడు. అదే జోరుతో సిరీస్‌ను ముగించే అవకాశం ఉందని అన్నాడు. ధర్మశాల పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని తెలిపాడు. జట్టులోకి బుమ్రా తిరిగి వచ్చాడని, ఆకాశ్ దీప్ తప్పుకున్నాడని అన్నాడు. నిన్న సాయంత్రం రజత్ పాటిదార్ గాయపడ్డాడని, దీంతో ఇవాళ దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేశాడని తెలిపాడు.

భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

ఇంగ్లాండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్

Also Read: బాలీవుడ్ హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ ప్రేమ ?