సతీసమేతంగా కోహ్లీ, న్యూజిలాండ్‌కు టీమిండియా
తొలి వన్డే మ్యాచ్ నేపియర్ వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ జట్టుతో పాటు సతీసమేతంగా ఆక్లాండ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

తొలి వన్డే మ్యాచ్ నేపియర్ వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ జట్టుతో పాటు సతీసమేతంగా ఆక్లాండ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న టీమిండియా తిరుగు ప్రయాణమై న్యూజిలాండ్ చేరుకుంది. కివీస్ పర్యటనలో భాగంగా జనవరి 23 నుంచి ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న కోహ్లీసేన సోమవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. తొలి వన్డే మ్యాచ్ నేపియర్ వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ జట్టుతో పాటు సతీసమేతంగా ఆక్లాండ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
కేదర్ జాదవ్, దినేశ్ కార్తీక్‌లు అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం.. కెప్టెన్ విరాట్ కోహ్లి, భార్య అనుష్కశర్మతో కలిసి రావడం లాంటి దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనను ఒక్క సిరీస్‌లోనూ ఓటమిపాలు కాకుండా పూర్తి చేసుకుంది. మూడు వన్డేల ఫార్మాట్‌ను 2-1 తేడాతో పూర్తి చేసుకుని నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 ఆధిక్యంతో ముగించిన భారత్ టీ20ను 1-1తో సమం చేసుకుంది.
Hello #TeamIndia. Auckland welcomes you #NZvIND ✈️????? pic.twitter.com/8ER80bKS5b
— BCCI (@BCCI) January 20, 2019
రెండు, మూడు వన్డేలు తౌరంగలో (26, 28న), నాలుగో వన్డే హామిల్టన్ (31న), ఐదో వన్డే వెల్లింగ్టన్‌లో (ఫిబ్రవరి 3న) జరుగుతాయి. తొలి టీ20 వెల్లింగ్టన్‌లో (ఫిబ్రవరి 6న), రెండో టీ20 ఆక్లాండ్‌లో (8న), మూడో టీ20 హామిల్టన్ (10న)లో జరుగుతాయి. మరో వైపు లంక పర్యటన పూర్తి చేసుకున్న కేన్ విలియమ్సన్ జట్టు సొంతగడ్డపై ఆడేందుకు సిద్ధమైంది. పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తేడాతో, మూడు వన్డేల సిరీస్‌ను 3-0ఆధిక్యంతో ఏకైక టీ20ను సైతం విజయంతో ముగించి విజయోత్సహంతో సొంతగడ్డపై అడుగుపెట్టింది.