వరల్డ్ కప్ ఈజీ కాదు: కోహ్లీసేనకు ద్రవిడ్ హెచ్చరిక

రెండేళ్లుగా దూకుడు మీద ఆడుతూ.. వరల్డ్ నెం.1 జట్టుగా ఎదిగిన టీమిండియా మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరల్డ్ కప్ సాధించడానికి కొన్ని వారాల వ్యవధి మాత్రమే ఉండటంతో భారత్ విజేతగా నిలవడంపై పలు అభిప్రాయాలు బయటికొస్తున్నాయి. ఇటీవల భారత పర్యటన చేపట్టిన ఆస్ట్రేలియా టీ20, వన్డే సిరీస్‌లను ఎగరేసుకుపోయింది. ఈ పరాజయంతో భారత్ వరల్డ్ కప్‌లో ఎంతమేర రాణిస్తుందోనని టోర్నీలో నిలవడం భారత్‌కు సులువైన వ్యవహారం కాదని అండర్ 19 జట్టు కోచ్, భారత్ ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆరోపించాడు.
Read Also : ఐపీఎల్‌కు ముందు సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ
‘వరల్డ్ కప్ గెలుచుకోవడం భారత్‌కు అంత ఈజీ కాదనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో మనం 2-3తేడాతో వన్డే సిరీస్ ఓడిపోయాం. ఇది మంచి పరిణామమే అనిపిస్తోంది. ప్రపంచ కప్ టోర్నీకి మనమింకా ఎంత సన్నద్ధమవ్వాలో తెలియజేసింది. దీనిని బట్టి టోర్నీలో భారత్.. ప్రతి జట్టుతో చాలా టఫ్ కాంపిటీషన్ ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. రెండేళ్లుగా భారత్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది’
‘వన్డే క్రికెట్‌లో రెండేళ్లుగా భారత్ నెం.1గా రాణిస్తోంది. అలా చూస్తే మనకు వరల్డ్ కప్ గెలవడం చాలా సులువైన పనే. కానీ, ఇటీవల ముగిసిన సిరీస్ ను బట్టి చూస్తే టీమిండియా చాలా గట్టిపోటీని ఎదుర్కొంటుందని అనిపిస్తోంది’ అని రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
Read Also : ఇండియా ఓపెన్ నుంచి సైనా అందుకే తప్పుకుందా..