Sanju Samson : టీమ్ ఇండియాతో నేను.. సంజు శాంసన్ పోస్ట్ వైరల్..అన్యాయం అంటున్న ఫ్యాన్స్..!
టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను యువ ఆటగాడు సంజు శాంసన్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.

Sanju Samson post viral
Sanju Samson post viral : టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ కోసం సన్నద్దం అవుతున్నారు. అందులో భాగంగా భారత జట్టు నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్ ఆడేందుకు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చేరుకుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను యువ ఆటగాడు సంజు శాంసన్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. జట్టులో తనకు స్థానం దక్కకపోయినా తాను మాత్రం జట్టుతోనే ఉన్నానని అంటూ అర్థం వచ్చేలా రాసుకొచ్చాడు. ప్రస్తుతం అతడు షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఆటగాళ్లు గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ప్రాక్టీస్ చేశారు. పక్కనే ఉన్న గోడపై శాంసన్ పెయింటింగ్ ఉంది. ఈ ఫోటోను సంజు శాంసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. గాడ్స్ ఓన్ కంట్రీలో టీమ్ఇండియాతో నేను అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా.. కేరళను దేవుని స్వంత దేశం అని పిలుస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ ఫోటో వైరల్‌గా మారింది. దీనిపై సంజు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. శాంసన్‌కు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని కామెంట్లు చేస్తున్నారు.
గతేడాది డిసెంబర్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో సంజు శాంసన్‌కు అవకాశాలు వస్తాయని అంతా బావించారు. కేఎల్ రాహుల్ కూడా గాయపడడంతో వన్డే ప్రపంచకప్‌లో శాంసన్‌కు ప్లేస్ గ్యారెంటీ అన్న అంచనాలు వచ్చాయి. గత నెలలో ఆసియాకప్ 2023 కోసం రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. అయితే.. కేఎల్ రాహుల్ కోలుకుని రావడంతో సంజును టోర్నమెంట్ ముగియకముందే ఇంటికి పంపిచారు. వన్డే ప్రపంచకప్‌లోనూ అతడికి అవకాశం రాలేదు.
ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియా తన మొదటి మ్యాచ్‌ను ఆస్ట్రేలియా ఆడనుంది. అక్టోబర్ 8న జరగనున్న ఈ మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక తిరువనంతపురం వేదికగా నేడు (అక్టోబర్ 3) నెదర్లాండ్స్‌తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది.
ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభ వేడుకలు రద్దు..!
View this post on Instagram