Sarfaraz Khan Run Out : రనౌట్ పై మౌనం వీడిన సర్ఫరాజ్ ఖాన్.. జడేజా గురించి కీలక వ్యాఖ్యలు
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ పై జడేజా క్షమాపణలు చెప్పాడు. తాజాగా ఈ అంశంపై సర్ఫరాజ్ స్పందించాడు.

Sarfaraz Khan and Jadeja
India vs England 3rd Test : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆటలో సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ పలు విమర్శలకు దారితీసింది. సర్ఫరాజ్ 64 వ్యక్తిగత పరుగుల వద్ద రనౌట్ రూపంలో నిష్క్రమించాడు. అతను రనౌట్ అవ్వడానికి కారణం జడేజా కావడంతో అతనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం జడేజా సర్ఫరాజ్ కు క్షమాపణలుసైతం చెప్పాడు. ఈ ఘటనపై తాజాగా సర్ఫరాజ్ ఖాన్ మౌనం వీడాడు. రవీంద్ర జడేజా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
Also Read : Ravindra Jadeja : తప్పునాదే.. సర్ఫరాజ్ ఖాన్‌కు క్షమాపణలు చెప్పిన రవీంద్ర జడేజా..
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. తొలిరోజు ఆటలో భారత్ బ్యాటర్లు వరుసగా ఔట్ కావడంతో సర్ఫరాజ్ కు తొలిరోజే బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. తొలుత కాస్త తడబడినా క్రీజులో నిలదొక్కుకున్న తరువాత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో అరంగ్రేటం మ్యాచ్ లోనే ఆఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఆఫ్ సెంచరీ చేయడంతో అతని తండ్రి, భార్య కన్నీళ్లు ఆపుకోలేక భావోద్వేగానికి గురయ్యారు. రోహిత్ శర్మ, టీం సభ్యులతో పాటు సర్ఫరాజ్ ఆఫ్ సెంచరీ చేయడంతో చప్పట్లతో అభినందనలు తెలిపారు.
Also Reada : Sarfaraz Khan : జడేజా స్వార్థం వల్లే సర్ఫరాజ్ ఖాన్ రనౌట్..! రోహిత్ శర్మ ఆగ్రహం
సర్ఫరాజ్ దూకుడు చూస్తే సెంచరీ చేస్తాడని అందరూ భావించారు.. కానీ, ఇన్నింగ్స్ 82 ఓవర్‌ను జేమ్స్ అండర్సన్ వేశాడు. ఆ సమయంలో 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు. ఆ ఓవర్‌లోని ఐదో బంతికి జడేజా షాట్ ఆడి పరుగుకు పిలిచాడు. వెంటనే స్పందించిన సర్ఫరాజ్ ఖాన్ పరుగు కోసం ముందుకు వెళ్లాడు. అయితే.. బంతి ఫీల్డర్ వద్దకు వెళ్లడంతో జడేజా పరుగుపై వెనక్కి తగ్గాడు. అప్పటికే బంతిని అందుకున్న మార్క్‌వుడ్ డైరెక్టు త్రో వేశాడు. బాల్ వికెట్లను పడగొట్టింది. అయితే.. అప్పటికి సర్ఫరాజ్ ఖాన్ క్రీజును చేరుకోకపోవడంతో అతడు రనౌట్ అయ్యాడు. దీంతో అరంగ్రేట ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్, అతడి తండ్రితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మసైతం నిరాశను వ్యక్తం చేశారు. అయితే, మ్యాచ్ అనంతరం.. తప్పు నాదే. నువ్వు బాగా ఆడావు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లో జడేజా రాసుకొచ్చాడు.
Also Read : CV Anand : ఇప్పటికే ఐదు సంవత్సరాలు లేటైంది.. సర్ఫరాజ్ ఖాన్ అరంగ్రేటంపై ఐపీఎస్ ఆఫీసర్ సీవీఆనంద్
జడేజా క్షమాపణలు చెప్పడంపై సర్ఫరాజ్ ఖాన్ స్పందించాడు. కొన్నిసార్లు కొంచెం తప్పుగా మాట్లాడవచ్చు.. కొన్నిసార్లు మీరు రన్నవుట్ అవుతారు.. కొన్నిసార్లు అలాంటివి జరగవు.. ఇవన్నీ ఆటలో భాగం అంటూ చెప్పుకొచ్చాడు. తన ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా తనకు పూర్తిగా సహకరించాడని సర్ఫరాజ్ ఖాన్ పేర్కొన్నాడు. నేను జడేజాతో లంచ్ టైంలో మాట్లాడాను.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో మాట్లాడటానికి ఇష్టపడే బ్యాటర్ నేను. కాబట్టి, నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాతో మాట్లాడుతూ ఉండమని జడేజాతో చెప్పాను. నేను ఆడుతున్నంత సేపు జడేజా నాకు సలహాలు ఇస్తూ సహకరించాడని సర్ఫరాజ్ పేర్కొన్నాడు.
https://twitter.com/mufaddal_vohra/status/1758313904210604344