బంగ్లాతో భారత్ మ్యాచ్: కెప్టెన్లు లేరు.. మాస్క్‌లతో బరిలోకి

బంగ్లాతో భారత్ మ్యాచ్: కెప్టెన్లు లేరు.. మాస్క్‌లతో బరిలోకి

Updated On : November 2, 2019 / 8:19 AM IST

భారత్-బంగ్లాల మధ్య జరగనున్న తొలి టీ20కు ఢిల్లీలోని ఫిరోజ్ షా(అరుణ్ జైట్లీ) స్టేడియం వేదిక కానుంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా జరగనున్న క్రమంలో రెండో టీ20 గుజరాత్‌లోని సౌరాష్ట్రలో, మూడో టీ20 మహారాష్ట్రలోని విదర్భలో జరగనున్నాయి. ఈ క్రమంలో తొలి టీ20కు ముందు శనివారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. భారత రెగ్యూలర్ కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతి, బంగ్లా రెగ్యూలర్ కెప్టెన్ షకీబ్ పై నిషేదం కారణంగా ఇరు జట్లు కెప్టెన్లు మార్చుకుని బరిలోకి దిగనున్నాయి. 

ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉండటంతో క్రికెటర్లు మాస్క్‌లు ధరించి ప్రాక్టీస్ చేశారు. యువ క్రికెటర్లను ప్రోత్సహించే క్రమంలో టీమిండియా మేనేజ్ మెంట్ జట్టులో చాలా మార్పులు చేసింది. మరోవైపు ఫీజుల పెంచాలని చేసిన సమ్మె అనంతరం బంగ్లాదేశ్ భారత్ లో జరగనున్న తొలి మ్యాచ్ ఆడే క్రమంలో సన్నాహాలు చేస్తుంది. 

పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ విశ్రాంతిలో ఉండగా హిట్ మాన్ రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, కృనాల్ పాండ్యా, రిషబ్ పంత్ కు తుది జట్టులో అవకాశం దాదాపు ఖాయమేూ. శివమ్ దూబె జట్టులో చోటు దక్కించుకుంటే మనీశ్ పాండే, సంజూ శాంసన్ లలో ఒకరికి రెస్ట్ తప్పదు. బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ లు బంగ్లా క్రికెటర్లపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. 

మేటి క్రికెటర్లతో రెడీ అవుతున్న భారత జట్టుతో మ్యాచ్ బంగ్లాదేశ్ ఛాలెంజింగ్ గా తీసుకుంటుంది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ తో దూసుకొస్తుంది. మహమ్మదుల్లా రియాద్ కెప్టెన్సీలో జట్టు వ్యూహాలు రచిస్తోంది. స్ట్రైక్ అనంతరం ఇతర కారణాలతో షకీబ్ అల్ హసన్ నిషేదానికి గురవడం, అనూహ్యంగా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తప్పుకోవడం, సైపుద్దీన్ గాయం జట్టులో మార్పులకు కారణమైంది. 

బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, నయీమ్ షేక్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మిథున్, అపిప్ హుస్సేన్, హుస్సేన్ సైకత్, అమినుల్ ఇస్లామ్, ఆర్పాత్ సన్నీ, తైజుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్ ఇస్లామ్, అబు హైదర్, ఆల్ అమిన్ హుస్సేన్

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఖలీల్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, శిఖర్ ధావన్, శివం దూబె, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, క్రునాల్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్