చావకొట్టారు: కివీస్‌పై సంచలన ప్రతీకార విజయాలు

చావకొట్టారు: కివీస్‌పై సంచలన ప్రతీకార విజయాలు

Updated On : June 22, 2021 / 1:29 PM IST

2014లో పర్యటనలో న్యూజిలాండ్ పర్యటన చేసిన టీమిండియా 0-4తేడాతో చిత్తుగా ఓడి ఘోర పరాజయానికి గురైంది. అప్పుడు జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో మూడో వన్డే టైతో ముగియగా మిగిలిన అన్ని మ్యాచ్‌లలో కివీస్‌దే పైచేయిగా వెనుదిరగాల్సి వచ్చింది. అంతకుమించి అన్నట్లు 2019 పర్యటనను ఆరంభించిన భారత్ సిరీస్‌ను దూకుడుగా మొదలెట్టి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది. హ్యాట్రిక్‌గా విజయాలు నమోదు చేసి సిరీస్‌ను చేజిక్కించుకుంది.

2014 తర్వాత న్యూజిలాండ్‌తో వరుసగా 2016, 2017, 2019లలో ఆడిన ప్రతి సిరీస్‌లోనూ భారత్‌దే పైచేయి. ఇలా భారత్‌ హ్యాట్రిక్‌గా సిరీస్ విజయాన్ని నమోదు చేసుకుంది. కివీస్-భారత్‌ల మధ్య 2016వ సంవత్సరంలో ఐదు వన్డేల సిరీస్‌ను 3-2తేడాతో చేజిక్కుంచుకోగా, 2017వ సంవత్సరంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1తేడాతో సిరీస్‌ను ఒడిసిపట్టింది. ఆ తర్వాత 2019లో మరోసారి ఐదు వన్డేల సిరీస్‌ను సోమవారం జరిగిన మ్యాచ్‌ విజయంతో ఖరారు చేసింది.