Rinku Singh: ఆ 5 సిక్సుల వల్ల ఇప్పుడు నేను ఇలా..: కేకేఆర్ స్టార్ రింకూ సింగ్

రింకూ సింగ్ 5 సిక్సులు కొట్టి తన జట్టును గెలిపించాడు. అతడు ఆడిన తీరును ఐపీఎల్ ఫ్యాన్స్ ఎన్నటికీ మర్చిపోలేరు.

Rinku Singh: ఆ 5 సిక్సుల వల్ల ఇప్పుడు నేను ఇలా..: కేకేఆర్ స్టార్ రింకూ సింగ్

Rinku Singh

Updated On : July 30, 2023 / 7:09 PM IST

Rinku Singh – KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ స్టార్ రింకూ సింగ్ తాను గత ఐపీఎల్‌(IPL – 2023)లో ఓ ఓవర్లో బాదిన 5 సిక్సులను గుర్తు చేసుకుంటూ, అవే తన జీవితాన్ని మార్చేశాయని, వాటి వల్లే ఇప్పుడు ఇలా అవకాశాలు పొందుతున్నానని చెప్పాడు.

గత ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ (GT vs KKR) మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో 200కు పైగా పరుగుల ఛేదనలో చివరి ఓవర్లో రింకూ సింగ్ 5 సిక్సులు కొట్టి తన జట్టును గెలిపించాడు. అతడు ఆడిన తీరును ఐపీఎల్ ఫ్యాన్స్ ఎన్నటికీ మర్చిపోలేరు. రింకూ సింగ్ చైనాలో జరగనున్న ఏషియన్ గేమ్స్‌ లో ఆడేందుకు భారత జట్టులో చోటు దక్కింది.

ఈ ఏడాది సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు ఏషియన్ గేమ్స్‌ జరుగుతాయి. తాజాగా, రింకూ సింగ్ మీడియాతో మాట్లాడుతూ… ఆ 5 సిక్సులు తన జీవితాన్ని మార్చేశాయని అన్నాడు. అంతకుముందు కూడా క్రికెట్ అభిమానులు తనను గుర్తించేవారని, అయితే, ఇంతగా కాదని చెప్పాడు. ఆ 5 సిక్సులు కొట్టిన తర్వాత మాత్రం తనను మరింతగా గుర్తిస్తున్నారని తెలిపాడు.

చాలా సంతోషంగా ఉందని రింకూ సింగ్ చెప్పాడు. ఇప్పుడు ఒంటరిగా బయటకు వెళ్లడం కొంత కష్టంగా ఉందని, చాలా అరుదుగా ఒంటరిగా వెళ్తున్నానని తెలిపాడు. అతడు చేసిన వ్యాఖ్యలను సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. ఏషియన్ గేమ్స్ స్క్వాడ్‌లో తన పేరు చూసుకుని చాలా భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు.

ఇందుకోసమే తాను కష్టపడుతున్నానని రింకూ సింగ్ తెలిపాడు. స్క్వాడ్‌లో తన పేరు ఉందని, తన స్నేహితులు పంపిన న్యూస్ లో చూశానని అన్నాడు. దేశం కోసం తాను ఆడుతున్నందుకు తన కుటుంబ సభ్యులు, బంధువులు చాలా హ్యాపీగా ఫీలయ్యారని తెలిపాడు.

Rahul Dravid : కోహ్లి, రోహిత్‌ల‌ను ఆడించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌దే.. మా ల‌క్ష్యం ఏంటంటే..? రాహుల్ ద్ర‌విడ్‌