లాక్ డౌన్ : రియల్ ఎస్టేట్ రంగానికి సడలింపు 

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2020 / 04:02 PM IST
లాక్ డౌన్ : రియల్ ఎస్టేట్ రంగానికి సడలింపు 

Updated On : May 2, 2020 / 4:02 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.  రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి సడలింపు  ఇచ్చింది. ఈ మేరకు (శనివారం మే 2, 2020) సచివాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ బిల్డర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు సమీక్షలో సీఎస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గృహ నిర్మాణాలకు సడలింపులు ఇచ్చారు. పనుల కోసం అవసరమైన మెటీరియల్ కొనుగోలుకు లైన్ క్లియర్ అయింది.

ఇటుక, ఇసుక, స్టీల్ సామాగ్రి తీసుకెళ్లే వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు డెవలపర్లకు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించింది.  వలస కార్మికులకు కౌన్సిలింట్ ఇవ్వాలని సూచించారు. గ్రేటర్ పరిధిలోని అన్ని పోలీస్ కమిషనరేట్ పరిధిల్లో ఉన్న వలస కార్మికులపై పూర్తిగా ఆరా తీస్తూ భవన నిర్మాణాలపై కూడా అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు సబంధించి క్రెడాయ్ బిల్డింగ్ అసోసియేషన్ ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ భవన నిర్మాణాలను ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 

లాక్ డౌన్ ప్రారంభం అయిప్పటి నుంచి భవన నిర్మాణాలు ఆగిపోవడంతో వలస కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వలస కార్మికుల ఇబ్బందులు ఇప్పటివరకు ప్రభుత్వం తొలగించినా మరోవైపు పనులు నిలిచిపోవడంతో ఆ ప్రభావం దీర్ఘ కాలికంగా ఉంటుందన్న అభిప్రాయంతో ముందు జాగ్రత్త చర్యగా భవని నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. 

సోమేష్ కుమార్ బిల్డర్లతో మాట్లాడుతూ భవన నిర్మాణాలు రేపటి నుంచి చేసుకోవచ్చని..అందుకు అవసరమైన మెటీరియల్ దుకాణాలను తెరింపించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సహకరిస్తామని, భవన నిర్మాణ పనులు మొదలు పెట్టాలని సూచించారు. వలస కార్మికులతో పనులను చేయించుకుంటున్న పెద్ద పెద్ద భవన నిర్మాణ సంస్థలు వలస నివారణ చర్యల్లో భాగంగా స్థానికంగానే ఉంచుకుని వారికి పనులు కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు.