Bandi Sanjay : పాపం కారు గ్యారేజీకి పోతోందని నారాజ్ అయితున్నాడు : కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
వరంగల్ డల్లాస్ కాలే,కనీసం బస్టాండ్ కూడా రాలే,వరదలు, బురదలు బోనస్, నిజామాబాద్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలే,100 కుటుంబాలు కూడా బాగుపడలే అంటూ కేటీఆర్ పై సెటైర్లు వేశారు బండి సంజయ్.

bandi sanjay
bandi sanjay .. KTR : పాపం కారు గ్యారేజీకి పోతోందని నారాజ్ అయితున్నాడు..నిజామాబాద్‌ల చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నడు..తొమ్మిదేళ్ల మీ దొంగ హామీల దొంగ జపం బట్టబయలైంది అంటూ మంత్రి కేటీఆర్ కు బీజేపీ నేత బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పాపం కారు గ్యారేజీకి పోతోందని #TwitterTillu నారాజ్ అంటూ కేటీఆర్ పై బండి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణ వచ్చిన సందర్భంగా..మోదీ 10 ఏళ్ల పాలనపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వినూత్నంగా కవిత రూపంలో సెటైర్లు వేశారు.దీనికి కౌంటర్ గా బండి సంజయ్ కూడా అదే స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. వరంగల్ డల్లాస్ కాలే,కనీసం బస్టాండ్ కూడా రాలే,వరదలు, బురదలు బోనస్ అంటూ సెటైర్లు సంధించారు.
వరంగల్ డల్లాస్ కాలే
కనీసం బస్టాండ్ కూడా రాలే
వరదలు, బురదలు బోనస్
నిజామాబాద్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలే
100 కుటుంబాలు కూడా బాగుపడలే
100 ఏళ్లకు సరిపడా దోపిడీ మాత్రం జరిగింది
ఆదిలాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లు రాలే
కనీసం అంబులెన్స్ పోయే తోవ కూడా ఎయ్యలే
గతి లేక గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు మాత్రం ఎక్కువైనయి
కరీంనగర్ లండన్ కాలే
వేములవాడకు ఏటా రూ.100 కోట్లు అందలే
కొండగట్టు అంజన్న ఘాట్‌రోడ్డు గతి మారలే
గులాబీ కబ్జాకోర్లు, కీచకులు మాత్రం పెరిగారు
లక్ష ఉద్యోగాలు రాలే,
3000 భృతి ఇయ్యలే,
రైతుల ఆత్మహత్యల ఆగలే,
పోడు పంచాయతీ పోలే,
ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కాలే – పదోన్నతులు పూర్తిగాలే
కొత్త పీఆర్‌సీ అమలు నోచుకోలే – ఠంచనుగా జీతాలు రాలే
తొమ్మిదేండ్లలో కల్వకుంట్ల ఖజానా నిండింది,
కల్వకుంట్ల భజనకారులకు కోట్ల కమీషన్లు అందినయి తప్ప
కష్టపడి కొట్లాడిన తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదు.
తొమ్మిదేండ్లు గాడిద పండ్లు తోమి,
ఇప్పుడు గాయి చేస్తే నమ్మేందుకు
తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు.
దొంగ హామీలు, దగా మాటలు, దౌర్జన్య చేతలకు కాలం చెల్లింది.
ఇలా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ట్విట్టర్ వేదికగానే కాకుండా సభలు, సమావేశాల ద్వారా మాటల తూటాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొసాగుతోంది.
పాపం కారు గ్యారేజీకి పోతోందని #TwitterTillu నారాజ్ అయితున్నడు
నిజామాబాద్‌ల చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నడు
కానీ ఏం ఫాయిదా?
తొమ్మిదేళ్ల మీ దొంగ హామీల దొంగ జపం బట్టబయలైందివరంగల్ డల్లాస్ కాలే
కనీసం బస్టాండ్ కూడా రాలే
వరదలు, బురదలు బోనస్నిజామాబాద్లో బోధన్ షుగర్…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 3, 2023