దక్షిణ భారతంపై వివక్ష వద్దు.. మేడారం జాతరకు రావాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ఆహ్వానం

దక్షిణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ వివక్ష చూపుతోందన్నారు.

దక్షిణ భారతంపై వివక్ష వద్దు.. మేడారం జాతరకు రావాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ఆహ్వానం

CM Revanth Reddy On Medaram Jatara

Updated On : February 23, 2024 / 6:13 PM IST

Medaram Jatara : మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రాన్ని విమర్శిస్తూ కీలక కామెంట్లు చేశారు. దక్షిణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ వివక్ష చూపుతోందన్నారు. అయోధ్యలో రాముడిని దర్శించుకున్నట్లే మేడారం వన దేవతలను దర్శించుకోవాలన్నారు. జాతరకు రావాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి.

”జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్లు పత్రికల్లో చూశాను. ఒకవేళ అది నిజమే అయితే, ఈ వివక్ష మంచిది కాదు. కుంభ మేళాను మీరు జాతీయ పండుగ చేయొచ్చు. కుంభమేళాకు కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయొచ్చు. ఈ పండక్కి మీరు నిధులు ఇవ్వకపోతే పత్రికలలో రాస్తే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. 45లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం మన ప్రాంతంలో జరిగే దక్షిణ కుంభమేళా సమ్మక్క, సారలమ్మ జాతరకు కేవలం రూ.3కోట్లు కేటాయించడం అంటే వివక్ష ఏ విధంగా ఉన్నదో, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని, మేడారం జాతరను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నదో అందరూ అర్థం చేసుకోవాలి.

Also Read : లాస్య నందితను వెంటాడిన వరుస ప్రమాదాలు.. తండ్రి చనిపోయిన ఫిబ్రవరి నెలలోనే కూతురూ మృతి

అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలని మీరు అందరికీ ఎలా అయితే చెబుతున్నారో.. మనందరం అయోధ్యలో రాముడిని ఎలా దర్శించుకుంటున్నామో.. అదే విధంగా మీరందరూ కూడా దక్షిణ భారతంలో ఉన్న సమ్మక్క సారలమ్మ దక్షిణ కుంభమేళాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ సందర్శించుకోవాల్సిందిగా అధికారికంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను. వారికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి అధికారికంగా ముఖ్యమంత్రిగా వారికి స్వాగతం పలికే బాధ్యతను మేము, మా మంత్రివర్గం తీసుకుంటాము అని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.

కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే వివక్ష చూయించడం మంచిది కాదు. దక్షిణ భారతంలోనే కాదు ప్రపంచంలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి వీరోచిత గాథ చరిత్ర పుటలలో ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రధాని మోదీ రావాలని, సందర్శించుకోవాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : లాస్య నందిత పోస్ట్‌మార్టం నివేదిక.. తలకు బలమైన గాయంతో పాటు..