Cm Revanth Reddy : ఓడిపోతే కుంగిపోతారా? ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారా?- కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్
సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై కొందరు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టడంలో వెనకబడ్డాం.

Cm Revanth Reddy : నల్గొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో ఎస్ ఎల్ బీసీ నిర్లక్ష్యానికి గురైందన్నారు. సాగు, తాగు నీటిని అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే.. కేసీఆర్ హయాంలోనే నల్లగొండ జిల్లాకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించారు. ఉమ్మడి జిల్లా సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడానికే ఉత్తమ్ కు ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి ఇచ్చామని అన్నారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటే… మేము వరి సాగును పండగ చేశాము అని రేవంత్ రెడ్డి అన్నారు.
”అధికారం పోతే.. ఫామ్ హౌస్ లో కాదు ఉండాల్సింది. పాలక పక్షానికి సూచనలు ఇవ్వాలి, తప్పులు చేస్తే ప్రశ్నించాలి. కేసీఆర్ ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారా? ఓడిపోతే కుంగిపోతారా? ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారా? ప్రజల పక్షాన మాట్లాడాల్సిన మీరు గాలి బ్యాచ్ ను రోడ్డు మీదకు వదిలారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చినట్లు నిరూపిస్తే.. నేను ఢిల్లీకి వచ్చి క్షమాపణ చెప్తా.
సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై కొందరు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టడంలో వెనకబడ్డాం. ఒక కుటుంబం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం. జనవరిలో రైతుభరోసా వేస్తాం. రైతులు నిర్భయంగా సన్నాలు సాగు చేయండి. బోనస్ ఇస్తాం. రీజినల్ రింగ్ రోడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూర్తవుతుంది. ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత నాది. ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీ అవుతుంది. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. మూసీ పునరుజ్జీవన బాధ్యత నాది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : మంత్రుల పనితీరుపై ఆరా తీస్తున్న సీఎం రేవంత్.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మార్పులు, చేర్పులు?