Vaccine Free Telangana : తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ఉచితం!

తెలంగాణ ప్రజలకు త్వరలోనే ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ కూడా కరోనా టీకాలు ఉచితంగా ఇచ్చేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది.

Vaccine Free Telangana : తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ఉచితం!

Corona Vaccine Free In Telangana

Updated On : April 22, 2021 / 12:40 PM IST

Corona vaccine free in Telangana : తెలంగాణ ప్రజలకు త్వరలోనే ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ కూడా కరోనా టీకాలు ఉచితంగా ఇచ్చేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఫ్రీగా ఇవ్వగా.. ఇప్పుడు 18 ఏళ్లు దాటిన వారికి కూడా అలాగే టీకాలు అందించనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వస్తే ఉచితంగా ఇస్తామని మంత్రి ఈటల గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగానే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.



అటు ఏపీ కూడా ఫ్రీ వ్యాక్సిన్‌పై నేడు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండవ డోస్ టీకాలు వేస్తోంది ప్రభుత్వం. ఏపీలో రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతోంది. రోజువారి కేసులు 10వేలకు చేరుతున్నాయి. దీంతో కోవిడ్ పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇచ్చే విషయంలోనూ సానుకూల నిర్ణయం వచ్చే అవకాశముంది.