Cyber Fraud : పెళ్లి చేసుకుంటానని రూ. 50 లక్షలు దోచేశాడు

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు..విదేశాల్లో ఉన్నా..భారతదేశానికి వచ్చి స్థిర పడుతా..అంటూ ఓ మహిళను నమ్మించి..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 50 లక్షలు దోచేశాడు.

Cyber Fraud : పెళ్లి చేసుకుంటానని రూ. 50 లక్షలు దోచేశాడు

Cyber

Updated On : June 20, 2021 / 9:13 AM IST

Cyber Fraud : పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు..విదేశాల్లో ఉన్నా..భారతదేశానికి వచ్చి స్థిర పడుతా..అంటూ ఓ మహిళను నమ్మించి..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 50 లక్షలు దోచేశాడు. సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు..జాగ్రత్తగా ఉండండి, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకండి అంటూ ఎన్ని సూచనలు చేస్తున్నా..కొంతమంది అజాగ్రత్తగా వ్యవహరిస్తుండడంతో పెద్ద ఎత్తున్న నష్టాల పాలవుతున్నారు. తాజాగా..హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ సైబర్ కేటుగాడి వలలో పడి మోసపోయింది.

హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో నివాసం ఉండే మహిళకు వివాహమై..భర్త చనిపోయారు. దీంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో మ్యాట్రిమోనిలో రిజిస్టర్ చేసుకున్నారు. ఇటలీలో ఉన్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇటలీలో డాక్టర్ నని చెప్పాడు. ఇటలీ నుంచి ఖరీదైన వస్తువులు పంపిస్తున్నానని నమ్మించాడు. ట్యాక్స్ ల పేరిట రూ. 50 లక్షలు కాజేశాడు కేటుగాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించి..లబోదిబోమంటూ…సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.