ఈడీ కేసులో జ్యూడీషియల్ కస్టడీ ముగియడంతో మరోసారి కోర్టు ముందుకు కవిత .. ఏం జరగనుంది?
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యి రెండు నెలలు పూర్తయింది. అయితే, 46 రోజులుగా తీహార్ జైల్లోని 6వ నెంబర్ (మహిళా ఖైదీలు) కాంప్లెక్స్ లో కవిత ఉంటున్నారు.

MLC Kavitha
Delhi Liquor scam : ఢిల్లీ లిక్కర్ పాలసీ – మనీలాండరింగ్ (ఈడీ) కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు కవితను హాజరుపర్చనున్నారు. మే 7న కోర్టు విధించిన జ్యూడీషియల్ కస్టడీ సమయం ముగియడంతో కోర్టులో కవితను ఈడీ హాజరుపర్చనుంది. అయితే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత అరెస్ట్ పై ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. ఇవాళ కవిత జ్యూడీషియల్ కస్టడీ పొడగింపు విచారణ సందర్భంగా.. కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకొవాలని కోర్టును ఈడీ కోరనుంది.
Also Read : Mlc Kavitha : అలాంటి వాళ్లను దేశం దాటించారు- రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యి రెండు నెలలు పూర్తయింది. అయితే, 46 రోజులుగా తీహార్ జైల్లోని 6వ నెంబర్ (మహిళా ఖైదీలు) కాంప్లెక్స్ లో కవిత ఉంటున్నారు. రెండు సార్లు జైల్లో ఉన్న కవితతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. ఇదిలాఉంటే.. మే10వ తేదీన కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై ఛార్జ్ షీటును ఈడీ దాఖలు చేసింది. ప్రీవెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 45, 44(1) ప్రకారం ఈ అనుబంధ ఛార్జ్ షీట్ డాక్యుమెంట్స్ ను కోర్టులో ఈడీ ఫైల్ చేసింది. కవితను అరెస్ట్ చేసిన 60రోజుల టైంలోపు చార్జ్ షీటు దాఖలు చేసినట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల కింద 224 పేజీలతో చార్జిషీట్ ఈడీ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత, ఆప్ గోవా ప్రచారాన్ని నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్) దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్లను తాజా ఛార్జీషీటులో నిందితులుగా ఈడీ పేర్కొంది. ఇదిలాఉంటే.. జ్యూడీషియల్ కస్టడీ సమయం ముగియడంతో మే7న కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాంలో కవితను కింగ్ పిన్ గా పేర్కొంటున్న ఈడీ.. ఆప్ కి రూ. 100కోట్లు ముడుపులు అందించడంలో కవిత కీలక పాత్ర పోషించారని కోర్టు దృష్టికి ఈడీ తీసుకెళ్లింది. .
Also Read : MLC Kavitha Bail Petition : లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు
- కవిత అరెస్టు తరువాత..
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు.
రెండు దఫాలుగా 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది.
14రోజులకు ఒకసారి కవిత జ్యూడీషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తుంది.
తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది.
మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం సీబీఐ కేసులోనూ కవితకు జ్యూడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు విధించింది.
సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీని మే20 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు.
కోర్టు అనుమతితో జైల్లో పలు పుస్తకాలను చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గుడుపుతున్న కవిత.
లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐల అరెస్ట్ లను సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యూలర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే తిరస్కరించిన రౌస్ ఎవెన్యూ కోర్టు.
ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు లో సవాల్ చేసిన కవిత.
ఢిల్లీ హైకోర్టు లో కవిత బెయిల్ పిటిషన్ పై మే 24న జరగనున్న విచారణ.
తిహార్ జైల్ లో వారానికి రెండు సార్లు కవితతో ములాఖత్ అవుతున్న ఆమె భర్త అనిల్.
ప్రతిరోజు కవితతో ఐదు నిమిషాలు ఫోన్ లో మాట్లాడుతున్న కుటుంబ సభ్యులు.
కవితకు ధైర్యం చెప్పడంతో పాటూ న్యాయపరంగా ముందుకెళ్లాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.