Cancer: ‘నాకు క్యాన్సర్.6నెలల కంటే ఎక్కువ బతకను ఈ విషయం మా అమ్మానాన్నలకు చెప్పొద్దు’..డాక్టర్‌ని కోరిన ఆరేళ్ల బాలుడు
‘నాకు క్యాన్సర్...ఆరు నెలల కంటే ఎక్కువ బతకను ఈ విషయం మా అమ్మానాన్నలకు చెప్పొద్దు’..డాక్టర్‌ని కోరాడు ఓ ఆరేళ్ల బాలుడు. ఆ పిల్లాడి మాటలు విన్న డాక్టర్ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్నవయస్సులో ఇంత పరిణితి ఉన్న ఈ బాలుడికా క్యాన్సర్ అని బాధపడ్డారు. ఇది రీల్ కాదు రియల్ స్టోరీ..ఆ పిల్లాడి గురించి డాక్టర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయటంతో ఈ కన్నీటి కథ అంత గొప్ప మనస్సున్న ఆ బాలుడి కథ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Doctor shares heartbreaking story of a Six Years old cancer patient (1)
Cancer : ‘‘డాక్టర్ నాకు ఆరోగ్యం బాగాలేదని మా అమ్మానాన్నలు మీ దగ్గరకు తీసుకొచ్చారు. కానీ నాకు ఎందుకు అనారోగ్యంగా ఉందో నాకు తెలుసు..నాకు క్యాన్సర్ వచ్చింది. చివరి స్టేజ్ లో ఉన్నాను..ఎక్కువ కాలం బతకను..ఈ విషయం నాకు తెలుసు..ఎలా తెలుసంటారా? నాకు ఉన్న అనారోగ్య లక్షల గురించి గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను..నాకు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంది ఎక్కువ కాలం బతకను కానీ ఈవిషయాన్ని మా అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్’’అంటూ డాక్టర్ ను కోరాడు ఓ పిల్లాడు. అవును ఓ ఆరేళ్ల బాలుడు ఇంత పెద్ద ఆరిందలాగా తన ఆరోగ్యం గురించి కాకుండా తన అమ్మానాన్నలు తనకు క్యాన్సర్ అని తెలిస్తేఎక్కడా భరించలేరని ఆలోచించాడు. ఆరేళ్ల పిల్లాడు 60 ఏళ్ల పరిణితితో ఆలోచించి తనకు క్యాన్సర్ వచ్చిందని తన అమ్మానాన్నలకు చెప్పొద్దు వారు తట్టుకోలేరు అంటూ డాక్టర్ ను కోరిన ఓ ఆరేళ్ల బాలుడి కన్నీటి కథ ఇది. ఇది రీల్ కాదు రియల్..
క్యాన్సర్ అంటేనే తెలియని పసివయస్సు ఆరేళ్లంటే. కానీ ఆ పిల్లాడు మాత్రం తనకంటే ఎక్కువగా తన అమ్మానాన్నల గురించి ఆలోచించాడు. తనకు క్యాన్సర్ సోకిందని చెప్పొద్దని డాక్టర్ ను కోరాడు. తనకు క్యాన్సర్ సోకిందనే విషయం మా అమ్మానాన్నలకు తెలియదు ఈ విషయాన్ని వారికి చెప్పొద్దు అంటూ డాక్టర్ ని బతిమాలాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డా.సుధీర్ కుమార్ ట్విటర్‌లో షేర్ చేయటంతో ఆ ఆరేళ్ల పిల్లాడికి ఉన్న అచంచలమైన పరిణితి..కన్నీటి కథ బయటకొచ్చింది. గ్రేట్ -4 క్యాన్సర్ తో ఉన్నానని..ఆరు నెలల కంటే ఎక్కవకాలం బతకనని డాక్టర్ కు చెప్పాడా ఆరేళ్లపిల్లాడు. ఎంతోమంది రోగుల్ని చూసిన డాక్టర్ ఎంతోమందికి వైద్యం చేసిన డాక్టర్ సుధీర్ కుమార్ ఆ ఆరేళ్ల పిల్లాడి పరిణితి చూసి ఆశ్చర్యపోయారు.గ్రేట్ -4 క్యాన్సర్ తో ఉన్నానని..ఆరు నెలల కంటే ఎక్కవకాలం బతకనని స్వయంగా తెలుసుకోవటమే కాకుండా ఈ విషయాన్ని తన అమ్మానాన్నలకు చెప్పొద్దు అంటూ ఆపిల్లాడు కోరటం ఆ డాక్టర్ కే కన్నీరు తెప్పించింది. తల్లిదండ్రుల గురించి అంతగా ఆరాటపడిని ఆ ఆరేళ్ల పిల్లాడు కోరినా ఆ డాక్టర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఎందుకంటే ఆ పిల్లాడిని క్యాన్సర్ బలి తీసుకుంది. అంత గొప్ప మనస్సు ఉన్న ఆ పిల్లాడు నెల రోజుల క్రితం క్యాన్సర్ తో చనిపోయాక డాక్టర్ సుధీర్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. ఆ పిల్లాడి గొప్ప మనస్సును బయటపెట్టారు.
కానీ మరో విషయం ఏమిటంటే ఈ పిల్లాడికి క్యాన్సర్ సోకిందనే విషయం తల్లిదండ్రులకు తెలుసు..బాధను గుండెల్లోనే దిగమింగుకున్నారు. పిల్లాడికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఆరేళ్ల పిల్లాడు మాత్రం తనకు ఎందుకిలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నాయోనని తెలుసుకోవటానికి గూగుల్ లో సెర్చ్ చేసి మరీ తెలుసుకున్నాడు. తనకు తెలిసిన ఆ భయంకర విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పొద్దని డాక్టర్ ని కోరాడు. ఆ తల్లిదండ్రులకే గొప్పవారనుకుంటే ఆ పిల్లాడు అంతకంటే గొప్పమనస్సున్నవాడని చెప్పుకుని తీరాలి. పుట్టి పట్టుమని పదేళ్లుకూడా నిండకుండానే తమ ఇంటి ఆనందం..వెలుగు అయిన బిడ్డకు క్యాన్సర్ సోకిందని తెలిసి గుండెలు పగిలేలా తమతో తామే ఆవేదన చెందారా తల్లిదండ్రులు. ఈ విషయం బాలుడికి తెలియకుండా జాగ్రత్తగా చికిత్స చేయించేవారు. క్షణం కూడా విడవకుండా ఆపిల్లాడిని కంటికి రెప్పలా కాచుకునేవారు. బిడ్డకు ఇష్టమైన ప్రదేశాలు చూపించారు. చివరి ఆరు నెలలు బిడ్డను క్షణం కూడా వదలకుండా సమయం అంతా బాలుడితోనే గడిపారా తల్లిదండ్రులు.
‘ఆ గొప్ప మనస్సున్న బాలుడు గురించి డాక్టర్ సుధీర్ కుమార్ వివరిస్తూ..‘‘ఒక రోజు ఓపీ చూస్తుండగా..భార్యాభర్తలు నా దగ్గరకు వచ్చారు. వాళ్ల ఆరేళ్ల అబ్బాయి ‘మను’ బయట ఉన్నాడు. అతడికి క్యాన్సర్ అని, కానీ ఆ విషయం అతడితో చెప్పొద్దని వారు నన్ను కోరుతూ చికిత్స చేయండీ కానీ ఈ వ్యాధి గురించి మాత్రం మా బాబుకి చెప్పకండి’ అని అభ్యర్థించారు. నేను సరే అన్నాను. ఆ తర్వాత వీల్ ఛెయిర్‌లో ‘మను’ను తీసుకొచ్చారు. ఆ బాలుడు చక్కగా చిరునవ్వులు చిందిస్తున్నాడు..ఎంతో తెలివైనవాడిలా కన్పించాడు. అతని మెడికల్ రిపోర్టులు పరిశీలించాక అతనికి మెదడు క్యాన్సర్ నాలుగో దశలో ఉంది. దీనివల్ల అతడి కుడి చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. కొంతసేపు చికిత్స గురించి మాట్లాడిన తర్వాత మను తన అమ్మానాన్నలను బయటకువెళ్లమని చెప్పాడు..వారు ఆందోళన చెందుతూనే బయటకు వెళ్లారు. వారు వెళ్లాక మను నాతో మాట్లాడుతూ.. ‘డాక్టర్ నేను ఈ వ్యాధి గురించి ఐపాడ్‌లో తెలుసుకున్నా. నాకు తెలుసు నేను ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు బతకనని. కానీ, ఈ విషయం మా అమ్మానాన్నలకు చెప్పలేదు. చెబితే వారు తట్టుకోలేరు. ప్లీజ్ మీరు కూడా చెప్పొద్దు’ అన్నాడు. అది వినగానే నాకు కొంతసేపు నోట మాటరాలేదు. చాలా ఆశ్చర్యపోయాను. ఇంత చిన్నవయస్సులో ఇంత పరిణితిగా ఆలోచిస్తున్నాడే ఇతనికా క్యాన్సర్ అని ఎంతో బాధపడ్డాను. పైకి మాత్రం తెలియకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పా. ఆ తర్వాత మనును బయటకు వెళ్లిపొమ్మని చెప్పి.. నేను అతని అమ్మానాన్నలతో మాట్లాడా. మను నాకు చెప్పిందంతా చెప్పి.. ఇదంతా మీకు తెలియనట్లే ఉండాలని కోరా. ఎందుకంటే.. ఇలాంటి సున్నితమైన విషయాలు కుటుంబానికి తెలియాలి. అప్పుడే చివరి రోజుల్లో అయినా వారిని సంతోషంగా ఉంచగలుగుతారు. ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుని భారమైన హృదయంతో వెళ్లిపోయారు’’.
‘‘కొన్ని రోజుల తర్వాత ఈ విషయం నేను మర్చిపోయాను నా డ్యూటీలో నేను బిజీ అయిపోయాను. అలా తొమ్మిది నెలల తర్వాత ఆ దంపతులు నన్ను చూడటానికి వచ్చారు. నేను వారిని గుర్తుపట్టి మను గురించి అడిగా. నెల క్రితమే మను వారిని వదిలి వెళ్లిపోయాడని చెప్పారు. ఈ 8 నెలలు అతడిని ఎంతో ఆనందంగా చూసుకున్నామన్నాని నాకు చెప్పారు’ అని ఆ డాక్టర్ వివరించారు. ఈ ట్విటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి ధైర్యాన్ని, తల్లిదండ్రుల మీద అతడికున్న ప్రేమను పలువురు మెచ్చుకుంటూ, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.
7. I couldn't keep the promise to Manu, as it was important to bring family on the same page on this sensitive issue. It was vital that the family enjoyed together, whatever time was left. More so, as Manu knew about his illness. Whether he understood the gravity, I am unsure.
— Dr Sudhir Kumar MD DM?? (@hyderabaddoctor) January 4, 2023