GHMC fake finger print case : ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌ కేసు..గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ GHMC ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

GHMC fake finger print case : ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌ కేసు..గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరు అరెస్ట్

Ghmc Fake Finger Print Case (2)

Updated On : July 14, 2022 / 11:54 AM IST

GHMC fake finger print case : హైదరాబాద్ GHMC ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. యూట్యూబ్ లో చూసి ఫెవికాల్, ఎంసీల్ మిక్స్ చేసి ఫేక్ వేలిముద్రలు తయారు చేసినట్లుగా అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.

యూట్యూబ్ లో చూసి కృత్రిమ వేలిముద్రలు తయారీ చేసినట్లు తెలిపారు. ఫెవికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేస్తే వచ్చిన సింథటిక్ లాంటి పదార్థాన్ని తమతో పాటు ఫీల్డ్ లోకి తీసుకెళ్లి పంచింగ్ చేశారు. 21 కృత్రిమ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం చేసుకోగా త్వరలో అసలు సూత్రధారులేవరో బయటపెడతామని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు.

కాగా..జీహెచ్‌ఎంసీ పరిధిలో మరోసారి ఫింగర్‌ ప్రింట్ల స్కామ్‌ కలకలం రేగింది. శానిటైజేషన్‌ కార్మికుల హాజరులో గోల్‌మాల్‌ వెలుగు చూసింది. కార్మికులు విధులకు హాజరు కాకపోయినా హాజరైనట్లు చేసిన వైనం బయటపడింది. సింథటిక్‌ ఫింగర్‌ ప్రింట్లు వాడి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు గోషామహల్‌ సర్కిల్‌ శానిటరీ సూపర్‌వైజర్‌ వెంకటరెడ్డి. పోలీసులు సుమారు 21 మంది ఫింగర్‌ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు… ఈ స్కామ్‌కు సంబంధించి ఇంకా ఎన్ని దారుణాలు బయటపడనున్నాయో తెలియాల్సి ఉంది.