LRS Fee : ప్రజలకు గుడ్ న్యూస్.. మరోసారి LRS గడువును పొడిగించిన ప్రభుత్వం
మరింత మందికి లబ్ధి చేకూరేలా ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించింది సర్కార్.

LRS Scheme
LRS Fee : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. మరోసారి LRS గడువును పెంచింది. ఈ నెల 30వ తేదీ వరకు 25 శాతం రాయితీ వర్తించేలా ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. మొత్తం 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా 25శాతం దరఖాస్తుదారులు కూడా ఫీజు చెల్లించ లేదు. దాంతో మరింత మందికి లబ్ధి చేకూరేలా ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించింది సర్కార్.
షెడ్యూల్ ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపు గడువు మార్చి 31వ తేదీతో పూర్తయింది. ఈ గడువును పెంచుతూ పురపాలక శాఖ ఆదేశాలిచ్చింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్‌కు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే లే అవుట్లను క్రమబద్ధీకరణ చేసింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు సమాచారం.
Also Read : భవిష్యత్తు తరాల కోసం ఆ భూములను వదిలేయండి- సీఎం రేవంత్ కి సమంత, రష్మిక, ఉపాసన, రేణుదేశాయ్ విన్నపం
అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ (లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) తీసుకొచ్చింది. 2020లో గత ప్రభుత్వం ఈ స్కీమ్ తెచ్చింది. అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా చేసుకున్న దరఖాస్తుదారులకు 25శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు.