Hyderabad Rain : ముంచుకొస్తున్న ముప్పు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక

Hyderabad Rain : వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అలర్ట్ అయ్యారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

Hyderabad Rain : ముంచుకొస్తున్న ముప్పు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక

Hyderabad Rain

Updated On : May 2, 2023 / 10:20 PM IST

Hyderabad Rain : హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. వద్దన్నా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో వానలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో నగరం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాలు వర్షం నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.

ఇది చాలదన్నట్లు వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. రాగల 3 గంట్లలో హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అలర్ట్ అయ్యారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

Also Read..Neera Cafe: ఏమిటీ నీరా?.. స్టార్‌ హోటల్‌ను తలపించేలా ఇన్ని కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్‌లో ఎందుకు కట్టారు?

ఇక, ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఆకాశం మేఘావృతమైంది. కారు మబ్బులు కమ్మేశాయి. ఏ క్షణమైనా కుంభవృష్టి వాన కురవనుంది. ఇప్పటికే కురుస్తున్న వానలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్లు కాసేపట్లో భారీ వర్షం అంటూ వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.