Shamshabad :మద్యం మత్తులో బీహార్ యువకులు వీరంగం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మద్యం మత్తులో కొంతమంది యువకులు నానా రచ్చా చేశారు. అడ్డుకున్న స్థానికులపై దాడికి దిగారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లిలో పీకల దాకా మద్యం సేవించిన బీహార్ యువకులు నడిరోడ్డుపై హంగామా చేశారు.

Bihar Youths Creates Nuisance
Bihar youths creates nuisance : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మద్యం మత్తులో కొంతమంది యువకులు నానా రచ్చా చేశారు. అడ్డుకున్న స్థానికులపై దాడికి దిగారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లిలో కొంతమంది యువకులు మంగళవారం (జూన్ 29,2021) రాత్రి వీరంగం సృష్టించారు. పీకల దాకా మద్యం సేవించిన బీహార్ యువకులు నడిరోడ్డుపై హంగామా చేశారు.
వారిని అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులపై దాడికి దిగారు. స్థానికంగా ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అతి కష్టంమీద వారిని పట్టుకున్న స్థానికులు శంషాబాద్ పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.