Hyderabad: హైదరాబాద్‌లో వర్షం.. విమానాల దారి మళ్లింపు
వర్షం, ఈదురుగాలుల వల్ల విమాన రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు.

Hyderabad
Hyderabad: హైదరాబాద్ జంట నగరాల్లో గురువారం సాయంత్రం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో మహానగరం ఒక్కసారిగా చల్లబడింది. వర్షం, ఈదురుగాలుల వల్ల విమాన రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు.
Rain in Hyderabad : హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం.. చల్లబడిన వాతావరణం
దిల్లీ, ముంబై, విశాఖపట్నం, బెంగళూరు నుంచి శంషాబాద్ రావాల్సిన విమానాల్ని అధికారులు వెనక్కిపంపారు. దిల్లీ నుంచి రావాల్సిన విమానాన్ని బెంగళూరుకు, ముంబై, విశాఖ పట్నం నుంచి రావాల్సిన విమానాలను విజయవాడకు, బెంగళూరు నుంచి రావాల్సిన విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించారు. శంషాబాద్ పరిధిలో వాతావరణం అనుకూలించే వరకు విమానాల్ని అనుమతించబోమని అధికారులు చెప్పారు. మరోవైపు సంగారెడ్డి పరిధిలోని పటాన్ చెరు, రామచంద్రపురం,లింగంపల్లి, బీహెచ్ఈఎల్, అమీన్‌పూర్‌లో కూడా భారీ వర్షం కురుస్తోంది. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, కటౌట్లు ఎగిరి రోడ్డుపై పడ్డాయి. దీంతో రోడ్డుపై ప్రయాణాలకు ఆటంకం కలుగుతోంది.