Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్టు ..

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిందితుల వద్ద పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్ లో 1.11 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్టు ..

Shamshabad Airport

Updated On : August 6, 2023 / 8:04 AM IST

Gold Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లో బంగారాన్ని (Gold) అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికారులు ఎంత నిఘాపెట్టినా బంగారం అక్రమ రవాణా (Gold smuggling) మాత్రం ఆగడం లేదు. విదేశాల నుంచి వచ్చే వారు అక్రమ పద్దతుల్లో గోల్డ్‌ను తీసుకుని వస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే, అక్రమంగా బంగారాన్ని తలిస్తున్న వారికి కస్టమ్స్ అధికారులు చెక్ పెడుతున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది.

Shamshabad Airport : బ్యాటరీలో మూడు కిలోల బంగారం .. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఏపీ వ్యక్తి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇండిగో విమానంలో జెడ్డా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇద్దరు ప్రయాణికులు వచ్చారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. వారి వద్ద రూ. కోటి విలువైన అక్రమ బంగారాన్ని గుర్తించారు.

Shamshabad Airport : వామ్మో.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టివేత.. 93లక్షల విలువైన కిలోన్నర గోల్డ్ సీజ్

ప్రయాణికుల వద్ద ఫోర్ టేబుల్ స్పీకర్స్, ఐరన్ బాక్స్‌లో 1.88 కిలోల అక్రమ బంగారంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్ లో 1.11 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితులను విచారణ చేపట్టారు.