YS Sharmila : 9ఏళ్లలో 9వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్న మీరు రైతుల పక్షమా? సీఎం కేసీఆర్ పై షర్మిల ఫైర్

YS Sharmila : రిజర్వేషన్లు పెంపు అని మైనారిటీలను మోసం చేశారు. పోడు పట్టాలు ఆశ చూపి గిరిజనులను మోసం చేశారు.

YS Sharmila : 9ఏళ్లలో 9వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్న మీరు రైతుల పక్షమా? సీఎం కేసీఆర్ పై షర్మిల ఫైర్

YS Sharmila

Updated On : June 28, 2023 / 7:54 PM IST

YS Sharmila – CM KCR : బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లక్ష్యంగా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల దాడి కొనసాగుతోంది. కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్నారు షర్మిల. తాజాగా మరోసారి ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

” జిత్తులమారి కేసీఆర్ ది పూటకో మాట-రోజుకో వేషం. కాంగ్రెస్, బీజేపీతో దొర దోస్తానా “అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు”. రెండు పార్టీలతో కలిసి నటించే దొర సినిమాకు ఇచ్చే సర్టిఫికెట్ A/B. అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి కేసీఆర్ గారు. మీరు ప్రజల పక్షం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి.

Also Read.. Padi Kaushik Reddy: ఛీటర్ రాజేందర్.. సింగిల్ గా వస్తా.. చర్చకు సిద్ధమా?: కౌశిక్ రెడ్డి

రుణమాఫీ అని 31 లక్షల మందిని మోసం చేసినందుకు రైతుల టీం అవుతరా..? 9ఏళ్లలో 9వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్న మీరు రైతుల పక్షమా? వరి వేస్తే ఉరి అని చెప్పినందుకు రైతుల పక్షామా? చేతికొచ్చిన పంట నేలపాలైతే రూపాయి పరిహారం ఇవ్వని మీరు రైతుల టీం ఎలా అవుతారు..? మూడు ఎకరాల భూమి అని దళితులను మోసం చేశారు.

రిజర్వేషన్లు పెంపు అని మైనారిటీలను మోసం చేశారు. పోడు పట్టాలు ఆశ చూపి గిరిజనులను మోసం చేశారు. జనాభాలో అగ్రస్థానంలో ఉన్న బీసీలను అణగదొక్కారు. మీ పాలనలో మోసపోని వర్గమే లేదు దొర గారు. మీది ప్రజల పక్షం కాదు. ప్రజలను దోచుకుతినే దొంగల పక్షం. జనాలను పట్టి పీడించే BRS దొంగల పక్షం. ఆత్మగౌరవం పేరు చెప్పి.. తన్ని తరిమేస్తారన్న చోటే రాజకీయం చేసే మీరు.. తెలంగాణ ప్రజల పక్షం అంటే నమ్మేంత పిచ్చోళ్లు ఎవరూ లేరు” అని మండిపడ్డారు షర్మిల.

Also Read..Eatala Rajender: అక్కడి నుంచే నా హత్యకు కుట్రలు జరుగుతున్నాయి.. వాళ్లే నాకు చెప్పారు: ఈటల

బీఆర్ఎస్.. బీ టీమ్ కాదు రైతుల టీమ్- సీఎం కేసీఆర్
కాగా.. బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) అంటే ఏదో ఒక పార్టీకి ‘ఏ’ టీమ్‌గానో.. ‘బీ’ టీమ్‌గానో ఉండే ప్రసక్తే లేదన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ప్రజల టీమ్‌గా ఉంటుందని, బాధితుల టీమ్‌గా ఉంటుందని, పీడితుల పక్షాన ఉంటుందని, రైతుల పక్షాన ఉంటుందని, దళితుల పక్షాన నిలబడుతుందని, వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటుందని, మహిళలకు రక్షణగా నిలబడుతుందని కేసీఆర్ అన్నారు. దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు, దేశ పరివర్తన బీఆర్‌ఎస్‌ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అంటే ఒక రాజకీయ పార్టీ కాదని, ఇదో మిషన్‌ అని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా పండరిపూర్‌ నియోజకవర్గం పరిధిలోని సర్కోలి గ్రామంలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీ టీమ్ కాదు రైతుల టీమ్ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు.