ఏ చౌరస్తాకి రమ్మన్నా వస్తానంటూ హరీశ్ రావుకి మంత్రి జూపల్లి సవాల్

Jupally Krishna Rao: పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే హరీశ్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు.

ఏ చౌరస్తాకి రమ్మన్నా వస్తానంటూ హరీశ్ రావుకి మంత్రి జూపల్లి సవాల్

Minister Jupally Krishna Rao

రైతుల గురించి చర్చించడానికి సిద్ధమా అంటూ మాజీ మంత్రి హరీశ్ రావుకి తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. చర్చించడానికి సమయం, తేదీ చెబితే తానే వస్తానని అన్నారు. తనను ఏ చౌరస్తాకి రమ్మన్నా వస్తానని చెప్పారు.

బీఆర్ఎస్ తప్పులన్నీ బయటపెట్టాక ముఖం ఎక్కడ దాచుకుంటారని జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు రాష్ట్ర ఖజానాను ముట్టడించారని, ఇప్పుడు ఇక చేసేదేమీ లేక సచివాలయాన్ని ముట్టడిస్తామని అంటున్నారని చెప్పారు. రాయలసీమకి నీళ్లు తరలిస్తుంటే గుడ్లు అప్పగించి చూశారని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఎప్పుడైనా పంట నష్టం ఇచ్చిందా అని జూపల్లి ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే హరీశ్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. హరీశ్ రావు వెనక్కి తిరిగి చూస్తే మీరు ఏం చేశారో గుర్తు వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో 6,000 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు.

Also Read: తిహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత.. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ