KTR : ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. మరోసారి తెలంగాణ హైకోర్టుకు వెళ్లనున్న కేటీఆర్..!

KTR : ఏసీబీ విచారించే సమయంలో తనతోపాటు న్యాయవాదిని కూడా అనుమతించేలా వారికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు.

KTR : ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. మరోసారి తెలంగాణ హైకోర్టుకు వెళ్లనున్న కేటీఆర్..!

KTR to move telangana high court

Updated On : January 7, 2025 / 11:35 PM IST

KTR : ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ నెల (8) బుధవారం తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ వేయనున్నట్టు తెలుస్తోంది.

తనపై నమోదైన ఈ కేసుకు సంబంధించి న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీకి డైరెక్షన్స్ ఇవ్వాలని కేటీఆర్ కోర్టును అభ్యర్థించనున్నారు. ఏసీబీ విచారించే సమయంలో తనతోపాటు న్యాయవాదిని కూడా అనుమతించేలా వారికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు.

Read Also : KTR: నెక్ట్స్‌ ఏంటి? మలుపులు తిరుగుతున్న ఈ-కార్‌ కేసు

ఇప్పటికే, కేటీఆర్‌తో పాటు న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి ఏసీబీ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈనెల 6న విచారణకు హాజరుకావాలని ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. అయితే, కేటీఆర్ తన లాయర్లతో కలిసి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.

అయితే, ఏసీబీ కార్యాలయంలోకి న్యాయవాదులను అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. ఈ క్రమంలోనే హైడ్రామా నెలకొంది. ఈ నెల 9న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది.

ఏసీబీ, ఈడీ ఇచ్చిన నోటీసులకు తన వ్యక్తిగతంగా హాజరయ్యి విచారణకు సహకరిస్తానని కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయవాదులతో కలిసి విచారణకు వెళ్లేందుకు అనుతించాలని తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు.

ఇప్పటికే, ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేటీఆర్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ దాఖలు చేశారు.

Read Also : YS Jagan Passport : ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట.. 5 ఏళ్లకు పాస్‌పోర్టు జారీకి ఆదేశం!