సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

అవి సర్కారు చేసిన హత్యలేనని తెలిపారు. ఆయా నేతన్నల కుటుంబాలకు రూ.25 లక్షల..

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

Ktr

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నేతన్నలవి బలవన్మరణాలు కాదని, అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని చెప్పారు. ఉపాధి లేక వారు ఉసురు తీసుకుంటున్నా ప్రభుత్వం ఆదుకోదా అని నిలదీశారు. ఇప్పటివరకు 10 మంది నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు.

అవి సర్కారు చేసిన హత్యలేనని తెలిపారు. ఆయా నేతన్నల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రెేషియా ఇవ్వాలన్నారు. ప్రాణాలు పోతున్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పదేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

మళ్లీ సమైక్యరాష్ట్రం నాటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. తాము అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని చెప్పారు. వాటిని మళ్లీ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారుపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దని అన్నారు.

Also Read: పవన్ వద్దకు నేను వచ్చింది అందుకు కాదు: రఘురామకృష్ణరాజు