అందుకే మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.. అయినప్పటికీ..: మంత్రి పొన్నం

కొండా సురేఖ ఒంటరి కాదని స్పష్టం చేశారు.

అందుకే మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.. అయినప్పటికీ..: మంత్రి పొన్నం

Minister Ponnam Prabhakar

Updated On : October 5, 2024 / 5:53 PM IST

సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బాధితులు కోరారని, అందుకే ఆమె ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని తెలిపారు. మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా అంత రియాక్షన్ ఎందుకు అవసరమని ప్రశ్నించారు.

వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత కూడా చర్చ కొనసాగించడం అనవసరమని చెప్పారు. బలహీన వర్గాలకు చెందిన మంత్రికి తామంతా అండగా ఉన్నామని, కొండా సురేఖ ఒంటరి కాదని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ పట్ల కేంద్రం మరోసారి వివక్షను చూపెట్టిందని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

కేంద్ర వివక్షపై బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకి ఏం లాభమని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసిరావాలని, వరదల వల్ల పదివేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్రం నుంచి వచ్చిన అధికారులకు చెప్పామని తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో మరో ఘోరాతి ఘోరం.. కోచింగ్ క్లాస్‌కు వెళ్తున్న బాలికపై దారుణాతి దారుణం