Prashant Kishor : రాహుల్ ప్రధాని అవుతారు – పీకే
రాజకీయ వ్యూహకర్త స్వరం మార్చారు.. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తెలిపారు. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు

Prashant Kishor
Prashant Kishor : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు. మొన్నటివరకు కాంగ్రెస్ తో ఏమి కాదని మాట్లాడిన కిషోర్.. ఇప్పుడు కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టమనే విధంగా మాట్లాడారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
చదవండి : Prashant Kishor : కాంగ్రెస్ లేకుండానే కొత్త కూటమి
కాంగ్రెస్ లేకుండా విపక్షాలు కూటమి కట్టి అధికారం చేపట్టడం కష్టమే అని చెప్పారు. అయితే గత వారం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు కిషోర్. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని.. ఆ పార్టీ లేకుండానే బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దీ రోజులకే.. తిరిగి కాంగ్రెస్ బలమైన పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. రెండు ఇంటర్వ్యూలలో ప్రశాంత్ భిన్నస్వరాలు వినిపించారు.
చదవండి : Prashant Kishore: మోడీ ఓడినా బీజేపీ పవర్ దశాబ్దాల పాటు తగ్గదంతే – ప్రశాంత్ కిశోర్
ఇక బీహార్ సీఎం నితీష్ తో మాట్లాడుతారా? అంటూ ఇంటర్వ్యూవర్ అడగ్గా.. తాము మాట్లాడుతూనే ఉంటామని తెలిపారు. తాను చాలామందితో కలిసి పనిచేశానని అయితే వీరిలో పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్‌తో మాత్రం పని చేయడం ఏమాత్రం నచ్చదని నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ.. గాంధీ పరివారం లేకపోయిన ఆ పార్టీ మనుగడ సాగించగలదని తేల్చిచెప్పారు.