PRC in Telangana: త్వరలోనే పీఆర్సీ 30శాతానికి పెంపుపై గుడ్ న్యూస్
రెండు మూడ్రోజుల్లో అసెంబ్లీ వేదికగా పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ మార్చి 17న శాసనసభలో చెప్పిన విషయం తెలిసిందే. ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేర రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటన రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

Cm Kcr Announcement On Telangana Government Employees Prc Tomorrow1
PRC in Telangana: రెండు మూడ్రోజుల్లో అసెంబ్లీ వేదికగా పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ మార్చి 17న శాసనసభలో చెప్పిన విషయం తెలిసిందే. ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేర రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటన రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం శాసనసభలో 30 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
32 శాతం వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఉద్యోగ సంఘాలు 33 శాతం వరకు ఫిట్‌మెంట్ ఇస్తారనే ఆశాభావంతో ఉన్నాయి. ఒక్క శాతం ఫిట్‌మెంట్‌కు ఏటా రూ.300 కోట్లు ఖజానాపై భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అంచనా. ఈ లెక్కన 30 శాతం ఇస్తే రూ.9వేల కోట్లు ఖర్చు పెరుగుతుంది. అదే 32 శాతం ఇస్తే రూ.9వేల 600 కోట్లు, 33 శాతమిస్తే రూ.9వేల 900 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాల రికార్డులు చెబుతున్నాయి.
ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లతో సీఎం భేటీ
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కనీసం 29శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ, రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపు, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ పీరియడ్ రెండేళ్లకు కుదింపు వంటి అంశాలపై సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు గతంలోనే ప్రకటించారు. ఇటీవల సీఎం కేసీఆర్ కూడా పీఆర్‌సీ, పదవీ విరమణ వయసు పెంపు వంటి అంశాలపై రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తానని శాసనసభలో వెల్లడించారు.
ప్రస్తుతం రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదివారం ఉద్యోగ సంఘాల నేతలను ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. ఉద్యోగ నేతలు, పలువురు ఎమ్మెల్యేలతో డిన్నర్ చేసి భేటీ అయ్యారు. రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పీఆర్సీ ఫిట్‌మెంట్, ఇతర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
సంతృప్తికరంగా ఫిట్‌మెంట్
30 శాతం వరకు పీఆర్సీ ఇచ్చే అవకాశం ఉందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన సంతృప్తితో ఉన్న నేపథ్యంలో 32 శాతం వరకు ప్రకటించవచ్చని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 34శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ, పదవీ విరమణ వయసు 60ఏళ్లకు పెంపుపై కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. సోమవారం ఈ అంశాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ వంటి ఇతర అంశాలపైనా ప్రకటన రావొచ్చని సమాచారం.