Reservations : ప్రైవేట్ సంస్థల్లోనూ దళితులకు రిజర్వేషన్

కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా ప్రైవేట్ సంస్థల్లోనూ దళితులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. 'వైన్స్, కాంట్రాక్ట్, ఫర్టిలైజర్

Reservations : ప్రైవేట్ సంస్థల్లోనూ దళితులకు రిజర్వేషన్

Reservations

Reservations : కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా ప్రైవేట్ సంస్థల్లోనూ దళితులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ‘వైన్స్, కాంట్రాక్ట్, ఫర్టిలైజర్ ఇలా అనేక ప్రైవేట్‌ సంస్థల్లో దళితులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారు. హుజురాబాద్ దళిత బంధు విజయం రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం కావాలి. దళిత బంధుకు పైసలు ఎక్కడివి అని ఈటల అన్నారు. మరిప్పుడు అందరికి దళిత బంధు వస్తుంది.. దీనికి ఈటల ఏం సమాధానం చెబుతారు?” అని హరీష్ రావు ప్రశ్నించారు.

Whats App Hacking : తల్లి వాట్సప్ హ్యాక్ చేసి, ఆమె ప్రియుడ్నిబ్లాక్ మెయిల్ చేసి…

హుజురాబాద్‌లో పోటాపోటీ ప్రచారాలు మొదలయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సభలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, హుజురాబాద్‌ టీఆర్ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఇతర పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్ లో చేరారు. దళిత బంధు రాదంటూ ఈటల దళితులను మోసం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఈటల మోసపూరిత మాటలు నమ్మొద్దని సూచించారు. ప్రతి దళిత కుటుంబానికి 9లక్షల 90వేలు వస్తున్నట్లు మేసేజ్‌లు వస్తున్నాయన్నారు.

బీజేపీ వాళ్లు ఏం చెప్పి హుజూరాబాద్ లో ఓట్లు అడుగుతారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల‌ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వ నందుకు ఓట్లు అడుగుతారా? అని నిలదీశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచామని చెప్పి ఓట్లు అడుగుతారా? మండిపడ్డారు. గతేడాది వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ కిరాయి ఎకరానికి 3 వేలు ఉంటే, నేడు ‌ఎకరానికి ఐదు వేలు అడుగుతున్నారని, డీజిల్ ధర 60 నుండి‌ 106 రూపాయలకు పెంచి రైతుల నడ్డి విరిచినందుకు ఓట్లు అడుగుతారా? అని చురకలంటించారు.

Costly Cottage : నీరు లేదు, కరెంటూ లేదు.. అయినా ఈ కాటేజీ ధర రూ.5 కోట్లు, ఎందుకంత రేటు అంటే..

సీఎం కేసీఆర్ రైతుబంధు కింద రైతులకు రూ.5వేలు ఇస్తే డీజిల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం రూ.2500 ఇంకో చేత్తో తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఉద్యోగాలు ఊడగొడుతుందని, మళ్లీ సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే లక్షా 30 వేల‌ ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలో మరో 50 నుంచి 60‌వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏంటని ప్రశ్నించారు. గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం చేకూరుతుందన్నారు. హుజూరాబాద్ లో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. వ్యక్తి ప్రయోజనమా? హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా? అనే చర్చ జరగాలన్నారు.