Telangana Govt : పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు మరింత లోతుగా తెలిసేలా కసరత్తు చేస్తోంది విద్యాశాఖ.

Telangana Govt : పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు..

Updated On : December 11, 2024 / 5:45 PM IST

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు కల్పించేలా కసరత్తు చేస్తోంది విద్యాశాఖ. దీనికోసం అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచే పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ గీతం వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది.

1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహం ముద్రించేలా ఏర్పాట్లు చేస్తోంది విద్యాశాఖ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు మరింత లోతుగా తెలిసేలా కసరత్తు చేస్తోంది విద్యాశాఖ. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

 

Also Read : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వెనుక మతలబేంటి? శిక్షణ తరగతులకు విపక్ష ఎమ్మెల్యేలు వస్తారా?