Fasal scheme : కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా అంతా బోగస్ : CM కేసీఆర్
కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా అంతా బోగస్ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

Cm Kcr Fire On Central Govt..fasal Insurance Scheme
cm kcr fire on Central Govt..Fasal insurance scheme : కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా అంతా బోగస్ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వ్యవసాయ రంగంపై కేంద్రం అవలంభిస్తున్న తీరు సరిగా లేదని..వర్షాలతో అసలే అల్లాడిపుతున్న రైతుల ఇప్పటికే తీవ్రంగా నష్టాపోయారు. ఇటువంటి సమయంలో కేంద్రం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పటం ఎంత వరకు సమంజసం? రైతులు ఏమైపోతారని ప్రశ్నించారు. కేంద్ర ప్రవేశపెట్టిన ఫసల్ బీమా అంతా వట్టి బోగస్ అని విమర్శించారు. పంట చేతికి వచ్చాక కేంద్ర రైతుల విషయంలో అవలంభించే తీరు అస్సలు బాగాలేదన్నారు.
ఇంకా కేసీఆర్ మాట్లాడుతు..మినాథన్, అశోక్ గులాటి లాంటి వారు వ్యవసాయ రంగంలో మార్పులపై కేంద్రానికి రెకమెండ్ చేశారు. వారి నివేదికలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. రైతులు అప్పుల కోసం వెళ్తే ప్రీమియం కట్టించుకుంటున్నారు. దేశంలో ఫసల్ బీమా యోజన శాస్త్రీయంగా లేదు. దేశంలో ఫసల్ బీమా యోజనతో రైతులకు ఏమాత్రం లాభం జరగటలేదు. ఫసల్ బీమా యోజనపై కేంద్రానికి సూచనలు పంపుతామని తెలిపారు.
Read more : Huzurabad : హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత
ఆహార ధాన్యాల కొరత రాకుండా శీతల గోదాములు నిర్మించాల్సిన బాధ్యతకు కూడా కేంద్రం మరిచిందని ఆరోపించారు.శీతల గోదాములు నిర్మించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉంటుంది. దాన్ని కేంద్రం మరచిందని ఈ సందర్బంగా కేసీఆర్ గుర్తు చేశారు. ఆహార ధాన్యాల కొరతే ఏర్పడితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం చెబితే..రైతులు ఏమైపోవాలి? అంటూ కేంద్రంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.