వామ్మోయ్ కరోనా : తెలంగాణాలో 36 కేసులు

వామ్మో కరోనా అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఈ వైరస్ బారిన పడిన వారం సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. పాజిటివ్ కేసులు అధికమౌతుండడంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో మృతి చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలు ముందుగానే అలర్ట్ అయ్యాయి. కానీ ఏపీ కంటే తెలంగాణాలో కేసులు అధికమౌతున్నాయి.
తాజాగా 2020, మార్చి 24వ తేదీ మంగళవారం మరో 3 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన సంఖ్య 36కి చేరుకుంది. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. కేసీఆర్ సర్కార్ వైరస్ ను కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయినా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. లండన్ నుంచి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు ఉన్నట్లు గుర్తించారు. అలాగే..జర్మని నుంచి వచ్చిన 39 ఏళ్ల మహిళకు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 61 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
See Also | ప్రపంచ యుధ్ధం కన్నా కరోనా ప్రమాదకరమైనది