Telangana Govt : గురుకుల పాఠశాల కాంట్రాక్టు టీచర్స్ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆమోదం
కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు 16 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్నారు.

Telangana Government (1)
Telangana Govt – Contract Teachers : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణ చేసేందుకు సిద్ధం అయింది. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు 16 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
TS DSC: గుడ్‌న్యూస్.. తెలంగాణ డీఎస్సీ.. 5,089 టీచర్ ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా
ఈ మేరకు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో 2,575 ఎస్జీటీ, 1739 ఎస్ఏ భర్తీ చేయనుండగా మరోవైపు 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి విధి విధానాలు ఖరారు చేసి.. రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే.
పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, మరో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. జిల్లాల వారిగా నోటిఫికేషన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. అయితే ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేశామని తెలిపారు. ఈ పరీక్ష సెప్టెంబర్ 15న నిర్వహిస్తారని తెలిపారు.