vaccines tender : కరోనా వ్యాక్సిన్ కోసం..షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

కరోనా వ్యాక్సిన్ల కోసం..తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెంటర్లను ఆహ్వానించింది. దీంట్లో భాగంగా ప్రభుత్వం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్ల ద్వారా మొత్తం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేయ‌డానికి ప్రభుత్వం సిద్ధ‌మైంది. ఈక్రమంలో షార్ట్ టెండర్ నోటిషికేషన్ జారీచేసింది.

vaccines tender : కరోనా వ్యాక్సిన్ కోసం..షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Covid 19

Updated On : May 19, 2021 / 12:53 PM IST

Telangana govt notification global tenders on vaccines : కరోనా వ్యాక్సిన్ల కోసం..తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెంటర్లను ఆహ్వానించింది. దీంట్లో భాగంగా ప్రభుత్వం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్ల ద్వారా మొత్తం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేయ‌డానికి ప్రభుత్వం సిద్ధ‌మైంది. ఈక్రమంలో షార్ట్ టెండర్ నోటిషికేషన్ జారీచేసింది.

కాగా..క‌రోనా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాల‌ని ఇటీవ‌లే తెలంగాణ‌ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ ప్ర‌భుత్వం ఈ రోజు షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్ల ద్వారా మొత్తం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేయ‌డానికి ప్రభుత్వం సిద్ధ‌మైంది.

బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీగా ప్ర‌క‌టించింది. అయితే, ఆరు నెలల్లో కోటి డోసుల వాక్సిన్ల‌ను సరఫరా చేయాల్సి ఉంటుంద‌ని ష‌ర‌తు విధించింది. నెలకు 1.5 మిలియన్ డోసులు విధిగా స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంటుందని చెప్పింది. తెలంగాణ‌లో వ్యాక్సిన్లు తీసుకునే అర్హ‌త ఉన్న వారంద‌రికీ వేయాల‌ని ఇప్ప‌టికే స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు శ‌ర‌వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది.