Telangana Corona Cases : తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,217 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 383 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

Telangana Corona Cases : తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Telangana Corona Cases

Updated On : February 6, 2022 / 11:10 PM IST

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 48వేల 434 కరోనా పరీక్షలు నిర్వహించగా… 1,217 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 383 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 103, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 99 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 3వేల 944 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,77,530 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,46,932 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26వేల 498 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,100కి పెరిగింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. శనివారంతో(2098) పోలిస్తే ఆదివారం కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గింది.

Chilli : మిరప కారం అధికంగా తింటే… వృద్ధాప్య ఛాయలు

మరోవైపు దేశంలోనూ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య తగ్గింది. దేశంలో నిన్న 1,07,474 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 2,13,246 మంది కోలుకున్నారని తెలిపింది. క‌రోనాతో మరో 865 మంది
ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో ప్ర‌స్తుతం 12,25,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మర‌ణాల సంఖ్య‌ 5,01,979కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,69,46,26,697 డోసుల వ్యాక్సిన్లు వేశారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నా కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని నిపుణులు సూచించారు.

గత రెండేళ్లుగా కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కొత్త కొత్త రూపాల్లో విరుచుకుపడుతోంది. కరోనా కారణంగా భారీగానే పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం థర్డ్‌వేవ్‌ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా అనేక చర్యలు చేపట్టడంతో అదుపులోకి వచ్చింది. వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

థర్డ్‌వేవ్‌ తగ్గుముఖంపై ఐసీఎంఆర్‌ (ICMR) కీలక వ్యాఖ్యలు చేసింది. మార్చి ఆరంభం నాటికి థర్డ్‌వేవ్‌ తగ్గుముఖం పడుతుందని తెలిపింది. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ్ బెంగాల్‌లో థర్డ్ వేవ్ ఫిబ్రవరి చివరినాటికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీరన్ పాండా పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి కోవిడ్‌ కేసులు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. వచ్చే మూడు, నాలుగు వారాల్లో దేశంలో థర్డ్‌వేవ్‌ ముగింపు దశకు చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.