Telangana Covid Cases List : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..

తెలంగాణలో నేటివరకు 7లక్షల 93వేల 607 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7లక్షల 88వేల 933 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 563 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.(Telangana Covid Cases List)

Telangana Covid Cases List : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..

Telangana Covid Report

Updated On : June 5, 2022 / 10:32 PM IST

Telangana Covid Cases List : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 8వేల 392 కరోనా పరీక్షలు నిర్వహించగా, 63 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 47 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 8, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4, నాగర్ కర్నూలు జిల్లాలో 2, కరీంనగర్ జిల్లాలో 2 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 47 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.

తెలంగాణలో నేటివరకు 7లక్షల 93వేల 607 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7లక్షల 88వేల 933 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 563 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 11వేల 107 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 76 మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Covid Cases List)

Covid in India..Mask must : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్లీ మాస్కు నిబంధన తప్పనిసరి

దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి అలజడి మొదలైంది. మహమ్మారి మరోసారి పుంజుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కేసులు.. భయాందోళనకు గురి చేస్తున్నాయి. పది రోజుల ముందు వరకు 2వేలకు అటు ఇటుగా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు మళ్లీ 4వేలు దాటింది. 24 గంటల్లో దేశంలో 4వేల 270 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జూన్ చివరి నాటికి ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సైంటిస్టుల అంచనాలు నిజం చేస్తూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కరోనాకు కేరాఫ్ గా నిలిచే మహారాష్ట్రలో కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అటు సౌతిండియా కరోనా హాట్ స్పాట్స్ లో ఎప్పుడూ ముందుండే కేరళలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సమయంలోనూ ముందుగా ఈ రాష్ట్రాల్లోనే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో కరోనా కేసులు కల్లోలం సృష్టించాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహా సీన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.03%కి పెరిగింది. కొత్త కేసుల్లో మహారాష్ట్ర నుంచే 1300కుపైగా కేసులు ఉన్నాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 15 మంది కొవిడ్ తో చనిపోయారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,692కు చేరింది. శనివారం మరో 2వేల 619 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.26 కోట్లు దాటింది. ఆ రేటు 98.73 శాతంగా కొనసాగుతోంది.

Covid booster : కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌.. డీసీజీఐ అనుమతి..

కొన్ని రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతూ 24 వేలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24,052 (0.06%) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న 11,92,427 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 194 కోట్లు దాటింది.