Hyderabad : భారీగా తరలివచ్చిన యువత.. వీరంతా దేనికి క్యూ కట్టారో తెలుసా?
భాగ్యనగరంలో ఓ ప్రాంతానికి యువత భారీగా తరలివచ్చారు. ఓ కంపెనీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అసలు అక్కడ ఏం జరిగింది? సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అసలు విషయం చదవండి.

Viral Video
Viral Video : నీళ్లకోసమో.. టిక్కెట్ల కోసమో లైన్లలో జనం భారీగా క్యూ కడుతుంటారు. తోపులాటలు జరుగుతుంటాయి. కానీ భాగ్యనగరంలో ఓ కంపెనీ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్యూకి తోపులాట జరిగింది. పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు తరలివచ్చారు. ఈ పరిస్థితిని చూసి నెటిజన్లు షాకయ్యారు. దేశంలోని పలు సిటీల్లో ఇదే తరహాలో నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read: మారువేషంలో అంబటి రాయుడు అంపైరింగ్.. గుర్తుపట్టిన యువకులు ఏం చేశారో తెలుసా..? వీడియో వైరల్
freshercareers.in అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో హైదరాబాద్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకి పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు. వారి చేతుల్లో రెజ్యూమ్ లు ఉన్నాయి. కొందరు లోపలికి వెళ్లగలిగారు. కొందరిని సెక్యూరిటీ అనుమతించకపోవడంతో గేటు బయటే ఉండి లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేసారు. వారిలో వారు తోసుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. ‘హైదరాబాద్ లో ఓ కంపెనీ నిర్వహించిన వాన్-ఇన్ ఇంటర్వ్యూలో కనిపించిన రద్దీ.. మీరు ఇలాంటి పరిస్థితిని చూసారా?’ అనే శీర్షికతో ఈ పోస్టును షేర్ చేశారు.
Also Read: రింకూసింగ్ సిక్స్ కొడితే అట్లుంటది మరి!.. స్టేడియంలో బద్దలైన గ్లాస్.. వీడియో వైరల్
ఇన్‌స్టాగ్రామ్‌లో పలువురు తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎదుర్కుంటున్న నిరుద్యోగ సమస్యను గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఇటీవల విశాఖపట్నంలో ప్రముఖ ఫార్మా కంపెనీ మహిళల కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపించిందని చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram