Passenger Falls Off Moving Train : తృటిలో బతికిపోయాడు.. రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా జారిపడ్డ ప్రయాణికుడు, కాపాడిన జవాన్

రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు కాలు జారి పడిపోయాడు. రైలుకి, ప్లాట్ ఫామ్ కి మధ్యలో ఇరుక్కున్నాడు. ఇది గమనించిన ఆర్పీఎఫ్ జవాన్ వెంటనే స్పందించాడు. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రయాణికుడిని రక్షించాడు.

Passenger Falls Off Moving Train : తృటిలో బతికిపోయాడు.. రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా జారిపడ్డ ప్రయాణికుడు, కాపాడిన జవాన్

Updated On : December 18, 2022 / 11:15 PM IST

Passenger Falls Off Moving Train : రన్నింగ్ రైలు ఎక్కే ప్రయత్నం చేయడం చాలా ప్రమాదకరం. రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో చాలామంది జారిపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శరీర భాగాలను కోల్పోయారు. ఇలాంటి ప్రమాదాలు అనేకం జరిగాయి. మన కళ్లారా చూస్తున్నాం.

అయినా కొందరిలో మార్పు రావడం లేదు. రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లా మైహర్ రైల్వే స్టేషన్ లో అలాంటి ఘటన ఒకటి జరిగింది. ఆ వ్యక్తి అదృష్టం బాగున్నట్లుంది. కొద్దిలో బతికిపోయాడు. లేదంటే, చాలా ఘోరం జరిగుండేది. రైలు చక్రాల కింద నలిగిపోయేవాడు.

Also Read..Lady With Phone On Railway Track : నీ ఫోన్ పిచ్చి పాడుగాను.. ప్రాణం మీదకు వచ్చినా ఫోన్ మాట్లాడటం మాత్రం ఆపలేదు.. షాకింగ్ వీడియో

సత్నా జిల్లాలో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మైహర్ రైల్వే స్టేషన్ లో రైలు ఆగిన సమయంలో నీళ్లు పట్టుకోవడానికి ఓ ప్రయాణికుడు రైలు దిగాడు. ట్యాప్ దగ్గరికి వెళ్లి నీళ్లు పట్టుకుంటున్నాడు. ఇంతలో రైలు కదిలింది. అంతే, అతడు కంగారుపడిపోయాడు. పరుగు అందుకున్నాడు.(Passenger Falls Off Moving Train)

రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలు జారి పడిపోయాడు. రైలుకి, ప్లాట్ ఫామ్ కి మధ్యలో అతడు ఇరుక్కున్నాడు. ఇది గమనించిన ఆర్పీఎఫ్ జవాన్ వెంటనే స్పందించాడు. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రయాణికుడిని రక్షించాడు. అతడిని వెనక్కి లాగేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. లేదంటే అతడు రైలు కింద పడిపోయేవాడు.

Also Read..IRCTC : ట్రైన్‌లో వాటర్ బాటిల్‌ ఎమ్మార్పీ కంటే రూ.5 ఎక్కువ అమ్మినందుకు రూ.లక్ష జరిమానా..

ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నం ఎంత ప్రమాదమో చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనం అంటున్నారు. రైలు ప్రయాణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

రన్నింగ్ ట్రైక్ ఎక్కే ప్రయత్నంలో జారిపడ్డాడు..

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.