పులివెందులలో దళితులకు రక్షణ లేదు: వైసీపీ వాళ్ల ఇళ్ల ముందు చెప్పులు తీసి వెళ్లాలి

‘పొరాడితే పోయేది ఏముంది..బానిస సంకెళ్లు తప్ప..బానిస బతుకులు బతుకుదాం.. పల్లకీలు మోద్దాం..

  • Published By: vamsi ,Published On : April 8, 2019 / 09:06 AM IST
పులివెందులలో దళితులకు రక్షణ లేదు: వైసీపీ వాళ్ల ఇళ్ల ముందు చెప్పులు తీసి వెళ్లాలి

Updated On : April 8, 2019 / 9:06 AM IST

‘పొరాడితే పోయేది ఏముంది..బానిస సంకెళ్లు తప్ప..బానిస బతుకులు బతుకుదాం.. పల్లకీలు మోద్దాం..

‘పొరాడితే పోయేది ఏముంది..బానిస సంకెళ్లు తప్ప..బానిస బతుకులు బతుకుదాం.. పల్లకీలు మోద్దాం.. కుదరిని పని అని, కొత్త తరం చేత ఎందుకు మోయిస్తారని ప్రశ్నించారు. జగన్ మాదిరిగా పది మంది చేత పనులు చేయించుకుని టిక్కెట్లు అమ్ముకోలేదని, అటువంటి అవసరం తనకు లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. పులివెందులలో దళితులకు రక్షణ లేదని అన్నారు. 
Read Also : తోట త్రిమూర్తులకు పవన్ హెచ్చరిక : అన్నయ్య మాటే విన.. మీ మాట వింటానా ?

జగన్ మాట్లాడితే కేసిఆర్ తీసుకుని వస్తారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట్లాడి.. కేసిఆర్ చేయలేదని, మాయావతిని పీఎం చేయాలని భావిస్తున్నారు. దళితులలో మళ్లీ దళితులను జగన్ వేరు చేశారని, వస్తే జగన్.. లేకుంటే చంద్రబాబు.. అంతే కానీ మూడో వ్యక్తిని రానివ్వరా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఇళ్ల ముందు నుంచి వెళ్లాలంటే చెప్పులు వదిలి వెళ్లాలని అన్నారు. మాయావతి గారి గురించి మాట్లాడుతూ.. ఆమెలో బెహన్‌జీ కాకుండా అమ్మ కనపడింది అని పవన్ అన్నారు.  
Read Also : పొల్లాచిలో వరుస హత్యలు.. కాలేజీ అమ్మాయిలే టార్గెట్