సీపీఐ జనసేనకు కటీఫ్ చెబుతుందా?

  • Published By: vamsi ,Published On : March 24, 2019 / 06:29 AM IST
సీపీఐ జనసేనకు కటీఫ్ చెబుతుందా?

Updated On : March 24, 2019 / 6:29 AM IST

జనసేన, వామపక్షాల కూటమిలో చీలిక వస్తుందా..? పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన విజయవాడ లోక్‌సభ స్థానానికి జనసేన తన అభ్యర్థిని ప్రకటించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. పొత్తులో భాగంగా విజయవాడలో తమ అభ్యర్థిగా చలసాని అజయ్‌కుమార్‌ పేరును సీపీఐ సెంట్రల్‌ కమిటీ ప్రకటించగా.. నామినేషన్‌ దాఖలుకు ఆయన సిద్ధమవుతున్న తరుణంలో జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాద్ బాబు పేరును జనసేన ప్రకటించింది.

అలాగే శనివారం విజయవాడలో రెండు చోట్ల బహిరంగ సభల్లో పవన్‌ పాల్గొనగా.. ఆ సభలకు పవన్ దూరంగా ఉన్నారు. సీట్లు సర్ధుబాటు సమయంలో విజయవాడ పశ్చిమ టిక్కెట్ తమకు కావాలని సీపీఐ పట్టుబట్టింది. అయితే అందుకు నిరాకరించిన జనసేన..  సీపీఐకి నూజివీడు సీటిచ్చింది. దాంతో అక్కినేని వనజ పేరును అభ్యర్థిగా ప్రకటించింది సీపీఐ అయితే ఆ సీటును జనసేన వెనక్కు తీసుకుంది. దానికి బదులుగా విజయవాడ పార్లమెంటు స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. ఇప్పుడు దీనిని కూడా వెనక్కి తీసుకోవడంతో సీపీఐ ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలో ఒక జనసేన కూటమి నుంచి తప్పుకునే ఆలోచనలో సీపీఐ ఉన్నట్లు తెలుస్తుంది.