నిజామాబాద్ జిల్లాలో వర్షం
నిజామాబాద్ జిల్లాలో వర్షం పడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

నిజామాబాద్ జిల్లాలో వర్షం పడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
నిజామాబాద్ : వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు చలి, మరోవైపు పొగమంచు, ఇంకొకవైపు వర్షం. రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వర్షం పడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. వాతావరణ శాఖ తెలంగాణలో వర్ష సూచన చేసినట్లుగానే జనవరి 25న శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలావుంటే హైదరాబాద్ లో మళ్లీ చలి గాలులు వీస్తున్నాయి. పగలు, రాత్రి వేళలలో చలి గాలులు వీస్తున్నాయి.