Home » Author »chvmurthy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 27 న విశాఖలో నిర్వహించే యోచనలో రాష్ట్ర పభుత్వం ఉంది. విశాఖలో కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం �
స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బు దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు బహిర్గతం చేయలేమని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రత్యుత్తరమిచ్చింది. భారత్, స్విట్జర
సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజార్టీ సాధించి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాది కాలంలో తన అధికారాన్ని కోల్పోతూ వస్తోంది. ఏడాది కాలంలో 5 రాష్ట్రాల్లో అధికారాన
గో ఎయిర్ విమానానికి భారీ ఫ్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం తెలత్తటంతో పైలట్ విమానాన్ని గువహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బర్దోయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కాగా విమానంలోన
ఏపీని మూడు రాజధానులుగా చేస్తానని సీఎంజగన్ చెప్పినప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కాగా ఈ అంశంపై అనంతపురం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారథి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రా�
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో రీపోస్టుమార్టం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందంతోపాటు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి సూపరింటెం
దేశీయ విమాన యాన సంస్ధ గో ఎయిర్ సోమవారం 18విమాన సర్వీసులను ర్దదు చేసింది. సిబ్బంది అందుబాటులో లేకపోవడం, కాక్‌పిట్ సిబ్బంది కొరతతో వీటిని రద్దు చేసినట్లు సంస్ధ తెలిపింది. గోఎయిర్‌కు చెందిన ఏ320 నియో విమానాల్లో ఇంజన్ సమస్య తలెత్తటంతో ఆ విమానా
రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు 60 వేల కోట్ల రూపాయలతో నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నామనిసీఎం జగన్ మోహన్ రెడ్డిచెప్పారు. కడపజిల్లాలో కుందూ నదిపై నిర�
అమెరికాలోని చికాగోలో డిసెంబర్ 22,ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఒక విందు వేడుకలో భాగంగా కొందరు యువకుల మద్య జరిగిన వివాదం కాల్పులకు దారి తీయడంతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ….చికాగోలో కొందరు యువకులు
ముంబై మహానగరంలో ఆదివారం డిసెంబర్ 22వ తేదీ రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి గం.7.10ని.ల సమయంలో విల్లే పార్లే ప్రాంతంలోని 13 అంతస్తుల భవనంలోని 7,8 అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘ
హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలు ప్రారంభమైన నాటి నుంచి క్రమేపీ ప్రయాణికుల సంఖ్య పెరుగతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే మెట్రో రైలుకూడా తన సేవలను విస్తరిస్తోంది. ప్రస్తుతం నాగోలు-రాయదుర్గం, ఎల్బీనగర్ -మియాపూర్ మార్గాల్లో సేవలందిస్తున్న మ�
దొంగతనం చేయటానికి ఫలానా వాళ్ల ఇల్లే అని ఏమిరాసి ఉండదు చోరశిఖామణులకు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ కన్నంవేసి దొరికినంత దోచుకుని పలాయనం చిత్తగిస్తారు, ఇ ఇటీవల రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక పోలీసు అధికారి ఇంటికే కన్నం వేసి దొర�
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ సోమవారం నుంచి 25వతేదీ బుధవారం వరకూ ఆయన జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి రోజు సోమవారం స్టీల్ ప్లాంట్క�
బ్యాంకుల వద్ద నిధుల కొరత లేదని..ఔత్సాహికులకు, పారిశ్రామికవర్గాలకు లోన్లు ఇస్తాం..పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాలు అభివృధ్ది చేసుకోమంటున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్. వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్ల�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రోజు రోజుకూ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం డిసెంబర్ 22న రాజ్‌ఘాట్ వద్ద ధర్నా నిర్వహిస్తోం�
ఏపీ రాజధాని అమరావతిని అక్కడి నుంచి తరలించటాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసారు. శుక్రవారం సాయంత్రం నుంచి రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. అమరావతి ప్రాంతంలో సెక్షన్ 144, 30 పోలీసు యాక్ట్ ను పో
రాష్ట్రంలో 2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు. ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే లోన్ �
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులతో కలిసి ఉద్యమంచేస్తామని ఆయన అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరక�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొందరు నిరసన తెలుపుతూ ఆందోళనలు చేస్తూంటే… మరోవైపు కొందరు ఈ చట్టాన్ని సమర్ధిస్తూ ర్యాలీలు నిర్వపిస్తున్నారు. దాదాపు 1100 మంది ప్రముఖులు, మేధావులు ప్రభుత్వానికి మద్దతుగా బహిరంగ లేఖ రాశా�
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో డిసెంబర్ 21, శనివారం సాయంత్రం జరిగే క్రిస్మస్ వేడుకలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తపై సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సదరు