జీడిమెట్లలో విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసిన కేటుగాళ్ళు

  • Published By: madhu ,Published On : September 17, 2020 / 11:17 AM IST
జీడిమెట్లలో విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసిన కేటుగాళ్ళు

హైదరాబాద్ లో జీడిమెట్లలో కేటుగాళ్లు విద్యార్థిని బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో విద్యార్థినికి పరిచయం అయిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఓ ఫొటో చూపిస్తూ..రూ. 4 లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురి చేశారు. తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే..ఫొటోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు.



చివరకు ధైర్యం చేసిన ఆ విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
https://10tv.in/telangana-dgp-mahender-reddy-visits-agency-area/
కరోనా క్రమంలో..స్కూళ్లు తెరుచుకోలేదు. ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నారు. జీడిమెట్లలో ఉంటున్న ఓ విద్యార్థినికి తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనిచ్చారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆ విద్యార్థినికి ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. వారితో తరచూ చాటింగ్ చేసేది. ఓ ఫొటో చూపిస్తూ..విద్యార్థిని బ్లాక్ మెయిలింగ్ కు దిగారు.



రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థిని ఇంటికి ముగ్గురు యువకులు వస్తుండడం తల్లిదండ్రులు గమనించారు. డబ్బుల కోసం ఈ నెల 14వ తేదిన విద్యార్థిని ఇంటికి వెళ్లారు యువకులు. వారిని నిలదీశారు. స్పోర్ట్స్ మెటిరీయల్ కోసం వచ్చామని వారు చెప్పారు. ఇంట్లో ఉన్న డబ్బులు మాయం అవుతుండడంతో విద్యార్థినిని నిలదీశారు.



అసలు విషయం చెప్పడంతో పేరెంట్స్ జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకున్నారు. ఎంతమందిని బ్లాక్ మెయిల్ కు దిగారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.