Veera Simha Reddy: తెల్లవారకముందే ఆట మొదలుపెడుతున్న వీరయ్య, వీరసింహారెడ్డి!
సంక్రాంతి కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు తెలుగు స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో రెడీ అయ్యారు. బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా విజృంభించనుండగా, ఊరమాస్ అవతారంలో ‘వాల్తేరు వీరయ్య’గా బరిలోకి దిగుతున్నాడు మెగాస్టార్. ఇక ఈ రెండు సినిమాలు కూడా వైవిధ్యమైన కథాంశాలతో వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద వార్ ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Veera Simha Reddy Waltair Veerayya To Have Six Shows In Telangana
Veera Simha Reddy: సంక్రాంతి కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు తెలుగు స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో రెడీ అయ్యారు. బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా విజృంభించనుండగా, ఊరమాస్ అవతారంలో ‘వాల్తేరు వీరయ్య’గా బరిలోకి దిగుతున్నాడు మెగాస్టార్. ఇక ఈ రెండు సినిమాలు కూడా వైవిధ్యమైన కథాంశాలతో వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద వార్ ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
Waltair Veerayya: ఏపీలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా టికెట్ ధరల పెంపు!
అయితే తెలుగువారికి అతిపెద్ద పండగ అయిన సంక్రాంతిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ వేళ వారికి ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలోనూ ఎలాంటి లోటు ఉండకుండా ఈ రెండు సినిమాలకు అదిరిపోయే వెసులుబాటులు కల్పిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ రెండు సినిమాల టికెట్ రేట్లను పెంచుకోవచ్చని తెలుపగా.. తాజాగా తెలంగాణ సర్కార్ ఈ రెండు సినిమాలకు ఏకంగా ఆరు షోలు వేసుకోవచ్చంటూ అనుమతినిచ్చింది.
Veera Simha Reddy: ఓవర్సీస్‌లో రిలీజ్‌కు ముందే హాఫ్ మిలియన్ మార్క్ దిశగా వీరసింహారెడ్డి పరుగులు..!
దీంతో పండగపూట తెల్లవారకముందే.. అంటే ఉదయం 4 గంటలకు థియేటర్లలో ఈ ఇద్దరు హీరోలు మోతమోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వీరసింహారెడ్డి చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండగా, వాల్తేరు వీరయ్య మూవీని బాబీ తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా అందాల భామ శ్రుతి హాసన్ నటించగా, ఈ రెండు చిత్రాలను కూడా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయడం విశేషం.