Harihara Veeramallu : అన్‌స్టాపబుల్ షోలో హరిహరవీరమల్లు గురించి మాట్లాడి.. సినిమాపై అంచనాలు పెంచేసిన డైరెక్టర్ క్రిష్..

క్రిష్ గతంలో బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు సినిమాలని తెరకెక్కించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో క్రిష్ ఈ షోకి రావడంతో హరిహరవీరమల్లు సినిమా గురించి కూడా మాట్లాడారు...................

Harihara Veeramallu : అన్‌స్టాపబుల్ షోలో హరిహరవీరమల్లు గురించి మాట్లాడి.. సినిమాపై అంచనాలు పెంచేసిన డైరెక్టర్ క్రిష్..

Harihara Veeramallu updates given by Director Krish in Unstoppable show

Harihara Veeramallu :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మొదటి ఎపిసోడ్ లో సినిమాలు, సరదాలు, ఫ్యామిలీ గురించి మాట్లాడగా ఈ ఎపిసోడ్ లో మొత్తం పాలిటిక్స్ మాట్లాడారు. కానీ షో మధ్యలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా వచ్చారు. దీంతో మళ్ళీ సినిమాల గురించి కూడా మాట్లాడారు. క్రిష్ గతంలో బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు సినిమాలని తెరకెక్కించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో క్రిష్ ఈ షోకి రావడంతో హరిహరవీరమల్లు సినిమా గురించి కూడా మాట్లాడారు.

హరిహరవీరమల్లు సినిమా ఔరంగజేబు రూలింగ్ కాలంలో జరిగే కథ అని పవన్ చెప్పారు. ఇక క్రిష్ మాట్లాడుతూ.. మీ ఇద్దరికీ సపరేట్ గా కథలు చెప్పాను కాని, ఇలా ఇద్దరి మధ్య ఒకేసారి కూర్చోవడం మొదటిసారి. ఒక సింహం, పులి మధ్య తల పెట్టినట్టు ఉంది. అందుకే త్రివిక్రమ్ గారు తప్పించుకున్నారు అనుకుంట. మీ శాతకర్ణి సినిమా 79 రోజుల్లో తీశాను. మామూలుగానే పిరియాడికల్ సినిమా అంటే చాలా టైం పడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రతి డిటైలింగ్ అడిగి అడిగి మరీ తెలుసుకుంటారు. మీ సినిమా తర్వాత అసలు మళ్ళీ హిస్టారికల్, పిరియాడికల్ సినిమా అసలు తీయకూడదు అనుకున్నాను. కాని పవన్ గారితో సినిమా అన్నప్పుడు ఆయన అన్ని రకాల సినిమాలు తీశారు. పీరియాడికల్ తీయలేదు. అందుకే మళ్ళీ పీరియాడికల్ కథతోనే ఆయన దగ్గరికి వెళ్లి కథ చెప్తే ఓకే అన్నారు. ఇన్నాళ్లు మీరు తొడ కొట్టారు. ఇప్పుడు పవన్ ఈ సినిమాలో తొడ కొడతాడు అని చెప్తూ సినిమాపై కూడా అంచనాలు పెంచేశారు క్రిష్.

Pawan Kalyan : పవన్ కి స్థలం ఇచ్చానని నా ఇల్లు కూలగొట్టారు.. ఇప్పటం గ్రామం పెద్దావిడ ఆవేదన

దీంతో ఈ షో ద్వారా హరిహరవీరమల్లు సినిమా అప్డేట్స్ కూడా కాస్తో కూస్తో వచ్చినట్టే. అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాని కరోనా వల్ల, ఆ తర్వాత పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాని అప్పటికి కూడా అయ్యేలా లేదు. మరి హరిహరవీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.