Amit Shah: కర్ణాటకలో బీజేపీ ఒంటరిగానే పోరు.. వెల్లడించిన అమిత్ షా

కర్ణాటకలో బీజేపీపై జేడీఎస్ అసత్య ప్రచారం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్లతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది.

Amit Shah: కర్ణాటకలో బీజేపీ ఒంటరిగానే పోరు.. వెల్లడించిన అమిత్ షా

Amit Shah: వచ్చే ఏడాది కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా. శనివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.

Twitter: ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకుంటున్న ట్విట్టర్ స్టాఫ్.. మస్క్ చర్యలతో ఉద్యోగుల తిప్పలు

‘‘కర్ణాటకలో బీజేపీపై జేడీఎస్ అసత్య ప్రచారం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్లతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. అవినీతి కోసం కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకుంటోంది. కానీ, బీజేపీ ప్రజల జీవితాల్ని మెరుగుపర్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇటీవల జరిగిన ఏడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 5 రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది. ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై అమిత్ షా దృష్టి కేంద్రీకరించారు.

అక్కడి బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు కర్ణాటక క్యాబినెట్ విస్తరణకు కూడా అమిత్ షా అంగీకారం తెలిపారు. దీంతో పార్టీలోని పలువురు సీనియర్ నేతలకు పదవులు దక్కే అవకాశాలున్నాయి.